AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: నవ మన్మథుడు అక్కినేని అందగాడు 63వ పుట్టిన రోజు నేడు.. ఫిట్‌నెస్ ఐకాన్ ఆరోగ్య రహస్యం ఏమిటంటే..

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించిన నాగార్జున విక్రమ్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మజ్ను సినిమాతో మొదటి సూపర్ హిట్ ను అందుకున్నారు.

Nagarjuna: నవ మన్మథుడు అక్కినేని అందగాడు 63వ పుట్టిన రోజు నేడు.. ఫిట్‌నెస్ ఐకాన్ ఆరోగ్య రహస్యం ఏమిటంటే..
Hbd Nagarjuna
Surya Kala
|

Updated on: Aug 29, 2022 | 12:59 PM

Share

Happy Birthday Nagarjuna: ఆరోగ్యకరమైన జీవనశైలి మనిషి ఆరోగ్యంగా ఉంచుతుంది.. సమతుల్య ఆహారం, ఫిట్ నెస్ తో ఉంటె అరవైలో కూడా నవ మన్మథుడిలా కనిపించవచ్చని నిరూపిస్తున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. టాలీవుడ్ ప్రముఖుడు నటుడు అక్కినేని నాగార్జున నేడు తన 63వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఇద్దరు కొడుకులకు తండ్రైన నాగార్జున.. తన కొడుకులకు అన్నలా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించిన నాగార్జున విక్రమ్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మజ్ను సినిమాతో మొదటి సూపర్ హిట్ ను అందుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ సహా 100కి పైగాచిత్రాలలో నటించారు. టాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకరిగా మాత్రమే కాకుండా, ఫిట్‌నెస్ ఐకాన్ గా వినోద ప్రపంచంలో తనదైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

ఈరోజు నాగార్జున 63 వ పుట్టినరోజు సందర్భంగా.. ఆకట్టుకునే శరీరాకృతికోసం ఆయన తీసుకునే శ్రద్ద ఏమిటో తెలుసుకుందాం. నాగార్జున. పలు  ఇంటర్వ్యూలలో తన పరిపూర్ణమైన, అందమైన శరీరాకృతి కోసం ఎలా పని చేసారో చెప్పారు. దినచర్యలో భాగంగా ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేస్తారు. అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు నిర్దిష్టమైన పద్దతిని అనుసరిస్తారు. నాగ్ రోజు..  ఉదయం 6 గంటలకు జిమ్ తో ప్రారంభమవుతుంది. ఒక గంట పాటు వ్యాయామం చేస్తారు. అల్పాహారంగా గుడ్డులోని తెల్లసొన, బ్రెడ్‌ని తీసుకుంటారు. మళ్ళీ ఉదయం 11 గంటలకు రెండవ సారి అల్పాహారంలో భాగంగా పొంగల్, దోస, ఇడ్లీ వంటి దక్షిణ భారతీయ వంటకాలను తీసుకుంటారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా అన్నం, రోటీ,నాలుగు రకాల కూరగాయలతో దేశీ భోజనం చేస్తారు. భోజనానికి ముందు పండ్లు తింటారు. చివరగా, రాత్రి 7 గంటలకు రాత్రి భోజనానికి  కాల్చిన చికెన్ లేదా చేపలతో ఉడికించిన కూరగాయలను తింటారు. రాత్రి 10 గంటలకు నిద్రపోతారు.

తాను ఆహార ప్రియుడునని నాగార్జున డైటింగ్ చేయడం తనకు ఇష్టం ఉందని పలు సందర్భాల్లో చెప్పారు నాగార్జున. అయినప్పటికీ తన ఆరోగ్య అలవాట్లతో ఆకట్టుకునే శరీరాకృతికి 50 శాతం కారణమని… మిగిలినవి వర్కవుట్‌లు కారణమని చెప్పారు. వారానికి ఆరు రోజులు వర్కవుట్స్ చేస్తానని.. ఈ షెడ్యూల్‌ను ఎప్పుడూ దాటవేయలేదని నాగార్జున చెప్పారు. నాగార్జున 63వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా.. ఆయన మరిన్ని సంవత్సరాలు ఆరోగ్యం, సంతోషంగా జీవించాలని.. అనేక విజయం సొంతం చేసుకోవాలని టీవీ 9 కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..