Viral Video: జనవరి స్పెల్లింగ్‌ అడిగిన రిపోర్టర్‌.. టీచర్‌ చెప్పిన సమాధానం వింటే షాక్‌ అవ్వాల్సిందే

కొన్ని ప్రాంతాల్లో టీచర్లు ఎంతో వెరైటీగా ఉంటారు. విద్యార్థుల సంగతి పక్కన పెడితే వారికి ఇంగ్లిష్‌, లెక్కలు కూడా సరిగా రావు. అయితే ఎలాగోలా కవర్‌ చేస్తూ ఉపాధ్యాయుల అవతారం ఎత్తుతుంటారు

Viral Video: జనవరి స్పెల్లింగ్‌ అడిగిన రిపోర్టర్‌.. టీచర్‌ చెప్పిన సమాధానం వింటే షాక్‌ అవ్వాల్సిందే
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 29, 2022 | 6:38 AM

కొన్ని ప్రాంతాల్లో టీచర్లు ఎంతో వెరైటీగా ఉంటారు. విద్యార్థుల సంగతి పక్కన పెడితే వారికి ఇంగ్లిష్‌, లెక్కలు కూడా సరిగా రావు. అయితే ఎలాగోలా కవర్‌ చేస్తూ ఉపాధ్యాయుల అవతారం ఎత్తుతుంటారు. అయితే ఉన్నతాధికారులు వచ్చినప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ వారి వ్యవహారం బయటపడక మానదు. ఈనేపథ్యంలో ఇటీవల కొందరు న్యూస్‌ రిపోర్టర్లు పాఠశాలలకు వెళ్లి టీచర్లను కొన్ని ప్రశ్నలు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సమాధానం తెలియని కొందరి టీచర్లు తడబడుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాల కూడా బాగా వైరలవుతున్నాయి. ప్రస్తుతం వీడియో కూడా అలాంటిదే. రిపోర్టర్‌ అడిగిన ఓ సులువైన ప్రశ్నకు టీచ‌ర్ ఇచ్చిన స‌మాధానం చూసి సదరు రిపోర్టర్‌తో పాటు నెటిజ‌న్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోలో ఒక టీచర్ తన స్టూడెంట్స్ తో కలిసి ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక రిపోర్టర్ వచ్చాడు. అతను.. టీచర్ తో కాసేపు మాట్లాడి.. జనవరి స్పెల్లింగ్‌ చెప్పమంటాడు. దీనికి టీచర్ నోట్లో నీళ్లు నములుతుంది. ఇదేం ప్రశ్న.. దీన్ని నా స్టూడెంట్స్ సులభంగా చెప్పేస్తారు అంంటుంది. దీంతో రిపోర్టర్ అక్కడున్న విద్యార్థులకు జనవరి స్పెల్లింగ్‌ చెప్పమని అడుగుతాడు. దీనికి వారు.. Janavary అని ఒకసారి, Janvari అని మరోక సారి ఆన్సర్ చెబుతారు. దీంతో రిపోర్టర్ షాక్‌ తింటాడు. చివరకు టీచర్‌ను స్పెల్లింగ్ అడిగితే.. ఆమె కూడా Janay.. అంటూ తప్పుగానే సమాధానిమిస్తుంది. దీంతో రిపోర్టర్‌కు నోట మాట రాదు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ‘సఖ్త్‌లాగ్’ అనే యూజర్‌ షేర్ చేయగా వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు టీచర్‌పై మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by SAKHT LOGG ? (@sakhtlogg)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..