AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన సూపర్ స్టార్.. మహేష్ న్యూలుక్‏కు‏ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

కానీ తాజాగా డాన్స్ రియాల్టీ షోలో తన కూతురు సీతారతో కలిసి సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

Mahesh Babu: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన సూపర్ స్టార్.. మహేష్ న్యూలుక్‏కు‏ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..
Mahesh Babu
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 30, 2022 | 8:18 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుంది. అయితే చాలా రోజులుగా ఎస్ఎస్ఎంబీ 28 సినిమా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న తన ఫ్యాన్స్‏కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చేశాడు మహేష్. వెండితెరపై కాకుండా రియాల్టీ షోలకు అరుదుగా వస్తుంటారు. కానీ తాజాగా డాన్స్ రియాల్టీ షోలో తన కూతురు సీతారతో కలిసి సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

జీ తెలుగు ఇప్పుడు డాన్స్ ఇండియా డాన్స్ అనే రియాల్టీ షోను ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుమార్తె సీతారతో కలిసి పాల్గొన్నారు. ఈ ప్రోమోలో మహేష్ మాట్లాడుతూ.. తనకు తెలిసి డాన్స్ అనేది ఓ సెలబ్రెషన్ అని అన్నారు. అనంతరం స్టేజ్ పై కంటెస్టెంట్లతో కలిసి సీతార డాన్స్ చేసింది. సర్కారు వారి పాట చిత్రంలోని పెన్నీ సాంగ్‏ సిగ్నెచర్ స్టెప్ వేసి ఆకట్టుకుంది సీతూపాప. మహేష్ బాబు ఎప్పుడూ ఇలా ఓ రియాల్టీ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రోమో చూసిన ఫ్యాన్స్ మహేష్ న్యూలుక్ చూసి ఫిదా అవుతున్నారు. మొదటి సారి తమ అభిమాన హీరో రియాల్టీ షోలో సందడి చేయడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు.

Mahesh

Mahesh

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!