India Vs Hong Kong: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన సూర్యకుమార్, కోహ్లీ.. హాంకాంగ్ ముందు భారీ టార్గెట్..
20 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో హాంకాంగ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. విరాట్ కోహ్లీ 59, సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
Asia Cup 2022: ఆసియాకప్‌లో భారత్, హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో హాంకాంగ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. విరాట్ కోహ్లీ 59, సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 6 నెలల 11 ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. విరాట్ చివరిసారిగా వెస్టిండీస్‌పై 18 ఫిబ్రవరి 2022న హాఫ్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 41 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 32 నెలల తర్వాత టీ20 క్రికెట్‌లో వరుసగా 3 మ్యాచ్‌ల్లో 10కి పైగా పరుగులు చేశాడు. చివరిసారి జనవరి 2020లో వరుసగా 3 మ్యాచ్‌లలో అతని బ్యాట్‌లో 10 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి.
హాంకాంగ్‌పై కూడా రోహిత్ శర్మ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మంచి ఆరంభాన్ని అందుకున్నా.. కానీ, అతను 12 బంతుల్లో 21 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. రోహిత్ వికెట్‌ను భారత సంతతికి చెందిన ఆయుష్ శుక్లా తీశాడు.
హాంకాంగ్‌పై తొలి పరుగు చేసిన వెంటనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. అదే సమయంలో మ్యాచ్ మూడో ఓవర్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి 22 పరుగులు చేశారు.
Full range.
A flurry of SIXES in the final over as @surya_14kumar hits the ball to all parts of the ground. He finishes unbeaten on 68 from 26 balls. ??????https://t.co/9txNRez6hL… #INDvHK #AsiaCup2022 pic.twitter.com/A001hlknIG
— BCCI (@BCCI) August 31, 2022
హాంకాంగ్‌పై కెఎల్ రాహుల్ ఫ్లాప్ షో అలాగే కొనసాగింది. అతని బ్యాట్ 39 బంతుల్లో 36 పరుగులు చేసింది. స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువగా ఉంది.
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హీరో హార్దిక్ పాండ్యాకు నేటి మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో రిషబ్ పంత్‌కి అవకాశం దక్కింది. తొలి మ్యాచ్‌లో పంత్ జట్టులో లేరు.
భారత్ – రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ (కీపర్), రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
హాంకాంగ్ – నిజాకత్ ఖాన్ (కెప్టెన్), యాసిమ్ మొర్తజా, బాబర్ హయత్, కించిత్ షా, ఎజాజ్ ఖాన్, స్కాట్ మెక్‌కెన్నీ (కీపర్), జీషన్ అలీ, హరూన్ అర్షద్, ఎహ్సాస్ ఖాన్, మహ్మద్ గజ్నాఫర్, ఆయుష్ శుక్లా.