Asia Cup 2022: 6 నెలలు.. 11 ఇన్నింగ్స్‌లు.. కట్ చేస్తే.. హాఫ్ సెంచరీతో సత్తా చాటిన కోహ్లీ..
విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2022లో మొదటి అర్ధ సెంచరీని కొట్టాడు. ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్స్‌లో విరాట్ కోహ్లీకి ఇది రెండో ఫిఫ్టీ మాత్రమే.
Asia Cup 2022: ఆసియా కప్ 2022లో, ఎట్టకేలకు భారత క్రికెట్ జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన పాత స్టైల్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. హాంకాంగ్‌పై హాఫ్ సెంచరీ సాధించి, టీమ్‌ఇండియాను భారీ స్కోరుకు తీసుకెళ్లడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచిన హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కాగా, హాంకాంగ్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. విరాట్ కోహ్లీ 59, సూర్యకుమార్ యాదవ్ 68 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
6 నెలల 11 ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. విరాట్ చివరిసారిగా వెస్టిండీస్‌పై 18 ఫిబ్రవరి 2022న హాఫ్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 41 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మొత్తంగా కోహ్లీ టీ20ల్లో తన 31 వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
????? for @imVkohli ??
A well made half-century for Virat Kohli. His 31st in T20Is.
Live – https://t.co/k9H9a0e758 #INDvHK #AsiaCup2022 pic.twitter.com/QeZsANLiFq
— BCCI (@BCCI) August 31, 2022
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 32 నెలల తర్వాత టీ20 క్రికెట్‌లో వరుసగా 3 మ్యాచ్‌ల్లో 10కి పైగా పరుగులు చేశాడు. చివరిసారి జనవరి 2020లో వరుసగా 3 మ్యాచ్‌లలో అతని బ్యాట్‌లో 10 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి.