AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmāstra: బాలీవుడ్‌ను వదలని బాయ్‌కాట్ బెడద.. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర కూడా తగిలిన సెగ

ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ఆశలు పెట్టుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మాస్త్ర అనే చెప్పాలి. ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి అంతగా బాలేదు.

Brahmāstra: బాలీవుడ్‌ను వదలని బాయ్‌కాట్ బెడద.. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర కూడా తగిలిన సెగ
Brahmastra
Rajeev Rayala
| Edited By: |

Updated on: Sep 01, 2022 | 1:22 PM

Share

ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ఆశలు పెట్టుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మాస్త్ర(Brahmāstra )అనే చెప్పాలి. ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి అంతగా బాలేదు. వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. అలాగే సౌత్ సినిమాల జోరు పెరిగింది. దాంతో అక్కడి దర్శక నిర్మాతలంతా ఆలోచనలో పడ్డారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో బాయ్‌కాట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయినా బాయ్‌కాట్ అనే పదం బాగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయినా అమీర్ ఖాన్  లాల్ సింగ్ చడ్డా సినిమాకు ఫ్లాప్ అవ్వడానికి అదికూడా ఒక కారణం అయ్యింది. దాంతో ఇప్పుడు బాయ్‌కాట్ అనే పదం వింటే దర్శకనిర్మాతల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా ఈ సెగ తగిలే అవకాశం కనిపిస్తోంది.

లవర్ బాయ్ రణబీర్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ సినిమా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సినిమాను మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాను బాయ్ కాట్ సెగ తగులుతోంది. సోషల్ మీడియాలో కొందరు ఈ సినిమాను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ హంగామా చేస్తున్నారు. దాంతో టీమ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవలే రణబీర్ షంషేరా సినిమాతో దారుణమైన ఫ్లాప్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Follow Us
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?