AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: లాల్ సింగ్ చద్దా నష్టాన్ని భరించనున్న హీరో.. అమీర్ ఖాన్ ఎంత వదులుకోవాల్సి వస్తుందంటే..

అయితే ఇప్పుడు సినిమా నష్టాన్ని భర్తీ చేసేందుకు అమీర్ ఖాన్ కీలకనిర్ణయం తీసుకున్నాడు. తన రెమ్యునరేషన్ మొత్తాన్ని ప్రొడ్యుసర్లకు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

Aamir Khan: లాల్ సింగ్ చద్దా నష్టాన్ని భరించనున్న హీరో.. అమీర్ ఖాన్ ఎంత వదులుకోవాల్సి వస్తుందంటే..
Aamir Khan
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2022 | 8:50 AM

Share

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీని బాయ్ కాట్ ట్రెండ్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. థియేటర్లలో విడుదలైన ప్రతిసినిమా పరజయాన్ని చవిచూస్తోంది. భారీ బడ్జెట్‎తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన చిత్రాలు భారీగా నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి. ఇప్పటికే అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన రక్షా బంధన్ , రణబీర్ కపూర్ షంషేరా చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక అమీర్ (Aamir Khan) నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా పరిస్థితి దారుణంగా పడిపోయింది. దాదాపు గత నాలుగేళ్లుగా కష్టపడ్డారు అమీర్. ఈ సినిమా కోసం మరే చిత్రాన్ని ఒప్పుకోలేదు. హాలీవుడ్ సూపర్ హిట్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమెక్‏గా తెరకెక్కిన ఈ ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. కానీ బాయ్ కాట్ సెగతో వసూళ్ల పరంగా దారుణంగా విఫలమయ్యింది. అయితే ఇప్పుడు సినిమా నష్టాన్ని భర్తీ చేసేందుకు అమీర్ ఖాన్ కీలకనిర్ణయం తీసుకున్నాడు. తన రెమ్యునరేషన్ మొత్తాన్ని ప్రొడ్యుసర్లకు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

బాలీవుడ్ వర్గాల సమచారం ప్రకారం లాల్ సింగ్ చద్దా నష్టాన్ని పూడ్చేందుకు అమీర్ ఖాన్ తన రెమ్యునరేషన్ మొత్తాన్ని వదిలేసుకున్నారట. ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ. 180 కోట్లు. ఈ చిత్రానికి అమీర్ ఖాన్ తోపాటు.. అతడి మాజీ భార్య కిరణ్ రావ్ సైతం సహ నిర్మాతలుగా ఉన్నారు. లాల్ సింగ్ చద్దా కోసం అమీర్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 50 కోట్లు. ఇక ఈ మొత్తాన్ని ఇప్పుడు తిరిగి ప్రొడ్యుసర్లకు ఇచ్చేస్తున్నారట అమీర్. ఆగస్ట్ 11న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు కనీసం రూ. 100 కోట్లు రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. కేవలం రూ. 70 కోట్లు మాత్రమే వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో కరీనా కపూర్, టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలలో నటించగా.. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.