AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruthi Haasan: రోడ్డు ప్రయాణాలంటే భయమంటున్న శ్రుతిహాసన్.. వైరలవుతున్న పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ కాంబోలో రాబోతున్న ఎన్బీకే 107 చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుంది.

Shruthi Haasan: రోడ్డు ప్రయాణాలంటే భయమంటున్న శ్రుతిహాసన్.. వైరలవుతున్న పోస్ట్..
Shruthi Haasan
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 31, 2022 | 6:14 PM

Share

తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruthi Haasan) స్థానం ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది.. గత కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శ్రుతి.. తిరిగి రావడంతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ తర్వాత శ్రుతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ చిత్రంలో కథానాయిక ఆద్య పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ కాంబోలో రాబోతున్న ఎన్బీకే 107 చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుంది.

అయితే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రుతి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్.. షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తాను రోడ్డు ప్రయాణాలకు దూరంగా ఉంటానని తెలిపింది. ప్రస్తుతం టర్కీలో ఉన్న శ్రుతి సెల్ఫీ షేర్ చేస్తూ.. నేను రోడ్డు ప్రయాణాలకు దూరంగా ఉంటాను. అది నా కన్‏క్లూజన్. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం శ్రుతి నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం సలార్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరరావు కీలకపాత్రలలో నటిస్తున్నారు. తాను ఇప్పటివరకు నటించిన స్టార్స్ అందరిలో ప్రభాస్ ది బెస్ట్ అని.. ఎంతో స్నేహపూర్వకంగా కలిసిపోతాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రుతి.

Shruthi

Shruthi

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..