Ramya Krishna: “నాకు అక్కడి సినిమాలు అచ్చిరావు”.. సంచలన కామెంట్స్ చేసిన రమ్యకృష్ణ
విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ సినిమా లైగర్ లో స్ట్రాంగ్ అండ్ ఇండివిడ్యూవల్ మదర్ గా నటించి అందర్నీ మెప్పించారు రమ్యకృష్ణ
విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ సినిమా లైగర్ లో స్ట్రాంగ్ అండ్ ఇండివిడ్యూవల్ మదర్ గా నటించి అందర్నీ మెప్పించారు రమ్యకృష్ణ(Ramya Krishna).. టాలీవుడ్ లో ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్ గా రాణించారు రమ్యకృష్ణ. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఆమె సినిమాల్లో కంటిన్యూ అవుతున్నారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు రమ్య కృష్ణ. ఇక ఇప్పుడు మదర్ రోల్స్ చేస్తూ మరోసారి తన సత్తా చాటుతున్నారు ఈ సీనియర్ హీరోయిన్. ఇదిలా ఉంటే తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు రమ్యకృష్ణ . తనకు బాలీవుడ్ సినిమాలు ఏమాత్రం అచ్చి రావంటూ.. కుండ బద్దలు కొట్టారు. ఆ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు.
రీసెంట్ గా ఓ ఇంటర్య్యూలో మాట్లాడిని రమ్యకృష్ణ .. తను బాలీవుడ్ సినిమాలు చేయడంపై కామెంట్ చేశారు.బాలీవుడ్ సినిమాలు తనకు అచ్చిరావని నిక్కచ్చిగా చెప్పారు. గతంలో కూడా బాలీవుడ్ సినిమాల్లో… క్రేజీ ప్రాజెక్ట్స్ లో పని చేసినప్పటికీ.. ఒక్కటీ కూడా తన సూపర్ హిట్‌ను ఇవ్వలేకపోయాయని ఆమె అన్నారు. ఇక లైగర్ సినిమా విషయానికి వస్తే.. రమ్య తన ట్రూ పర్ఫార్మెన్స్ తో మరో సారి అందర్నీ ఆకట్టుకున్నారు. మాస్ మదర్ గా తన నటనతో మరోసారి అందరిని కటిపడేశారు రమ్యకృష్ణ. బాలీవుడ్‌లోనూ సినిమా ఛాన్స్‌లు పట్టేస్తూ.. గ్లోబల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోతున్నారు.