AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman: సుమన్ మరణించారంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ ఛానల్స్ పై హీరో ఆగ్రహం..

తన గురించి నిరాధరమైన వార్తలు ప్రసారం చేసినందకు ఆ యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు సుమన్ (Suman) తెలిపారు.

Suman: సుమన్ మరణించారంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ ఛానల్స్ పై హీరో ఆగ్రహం..
Suman
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 31, 2022 | 6:15 PM

Share

తమ ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తలను టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ ఖండించారు. తాను క్షేమంగానే ఉన్నానని.. తన అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. సీనియర్ హీరో సుమన్ ఇక లేరంటూ గత కొద్ది రోజులుగా ఉత్తరాదికి చెందిన పలు యూట్యూబ్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‏లో భాగంగా బెంగుళూరులో ఉన్న సుమన్‏ తన సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకుని ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్ని అవాస్తవమని.. అలాంటి రూమర్స్ ప్రసారం చేస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్స్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తన గురించి నిరాధరమైన వార్తలు ప్రసారం చేసినందకు ఆ యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు సుమన్ (Suman) తెలిపారు.

తెలుగు చిత్రపరిశ్రమలో హీరోగా నటించిన ఆ తర్వాత సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సుమన్‏కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుమన్.. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ ఇక లేరంటూ ఉత్తరాదికి చెందిన పలు యూట్యూబ్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేశాయి. వాటిని చూసిని సుమన్ అభిమానులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తల్లో నిజమెంత ? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తన సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుమన్… ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. ఇలాంటి రూమర్స్ ప్రసారం చేస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు.

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..