Mahesh Babu: ఆ ఇద్దరి డ్యాన్స్‏కు మహేష్ ఫిదా.. అడక్కుండానే బంపర్ ఆఫర్ ఇచ్చిన సూపర్ స్టార్..

ఇటీవల విడుదల ఆ షో ప్రోమో యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది. డాన్సర్లతో కలిసి పెన్నీ పాటకు కాలు కదిపింది సీతార. తాజాగా ఈ షోకు సంబంధించి మరో ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

Mahesh Babu: ఆ ఇద్దరి డ్యాన్స్‏కు మహేష్ ఫిదా.. అడక్కుండానే బంపర్ ఆఫర్ ఇచ్చిన సూపర్ స్టార్..
Mahesh
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:11 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా కోసం సిద్దమవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే నెలలో పట్టాలెక్కనుంది. ఇక తన ఖాళీ సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న మహేష్.. ఇటీవలే పలు యాడ్ షూట్స్ లోనూ పాల్గొంటున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రిన్స్ లేటేస్ట్ న్యూ లుక్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఎప్పుడు వెండితెరపై ప్రేక్షకులను అలరించే మహేష్.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు నిర్వహిస్తున్న డాన్స్ ఇండియా డాన్స్ అనే రియాల్టీ షోకు తన కూతురు సితారతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహేష్. ఇటీవల విడుదల ఆ షో ప్రోమో యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది. డాన్సర్లతో కలిసి పెన్నీ పాటకు కాలు కదిపింది సీతార. తాజాగా ఈ షోకు సంబంధించి మరో ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

అందులో బాబు, కుమార్ అనే ఇద్దరు డాన్సర్లు అద్భుతంగా డాన్స్ చేశారు. వారిద్దరు వేసిన స్టెప్పులకు మహేష్ సైతం ఫిదా అయ్యారు. అనంతరం వారిని పొగడ్తలతో ముంచెత్తాడు మహేష్. తాను చేసే సినిమాలో గానీ.. తన సినిమాలో గానీ వారిద్దరికి అవకాశం ఇస్తానంటూ స్టేజ్ పై హామీ ఇచ్చాడు. దీంతో వెంటనే ఆ డాన్సర్లు ఇద్దరు మహేష్ కాళ్లపై పడిపోవడంతో వారిని హత్తుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.