AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Season 6: బిగ్‏బాస్ సరికొత్త ఇంటిని చూశారా ?.. ఫస్ట్ గ్లింప్స్‏తో హైప్ క్రియేట్ చేసిన మేకర్స్..

Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2022 | 9:32 AM

Share

బుల్లితెరపై నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ సందడి షూరు కాబోతుంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్ 6 ఇక ఈనెల 4 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో.. ఇప్పుడు 6వ సీజన్‏ను మరింత గ్రాండ్‏గా.. సరికొత్తగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తవ్వడం.. వారింతా క్వారంటైన్‏కు వెళ్లడం కూడా జరిగిపోయింది. ఈసారి మొత్తం 19 మంది బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన లిస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈసారి ఫేమస్ సెలబ్రెటీలు, బుల్లితెర నటీనటులు, సింగర్స్‏తోపాటు ఓ సామాన్యుడు కూడా వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా 15 మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపిచనున్న మేకర్స్… ఆ తర్వాత మరో నలుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్‏బాస్ ప్రారంభ తేదీ.. సమయం అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. తాజాగా బిగ్‏బాస్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్‏బాస్ ఇంటి సెట్ ను చూపించారు. అంతేకాకుండా రాబోయే కంటెస్టెంట్స్, వారి ఫర్ఫామెన్స్‏లకు సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించారు. గత సీజన్ల కంటే భిన్నంగా బిగ్‏బాస్ ఇంటిని సెట్ చేశారు నిర్వాహకులు. ఇక ఈ ఆదివారం బిగ్‏బాస్ సీజన్ 6 మరింత గ్రాండ్‏గా ప్రారంభం కానుంది. ఈసారి 24 గంటల లైవ్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈసారి చలాకీ చంటి, రీతూ చౌదరీ, గలాట గీతూ, అర్జున్ కళ్యాణ్, నువ్వు నాకు నచ్చావ్ సుదీప, యూట్యూబర్ ఆదిరెడ్డి వంటి మరికొందరి పేర్లు బయటకు వచ్చాయి.

Follow Us
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?