AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: ఒకేఒక జీవితం ప్రీరిలీజ్ ఈవెంట్ కు అందుకే అఖిల్ రాలేదంట..

శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఒకేఒక జీవితం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా డైరెక్టర్ శ్రీకార్తిక్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Akhil Akkineni: ఒకేఒక జీవితం ప్రీరిలీజ్ ఈవెంట్ కు అందుకే అఖిల్ రాలేదంట..
Akhil
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2022 | 8:44 PM

Share

శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఒకేఒక జీవితం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా డైరెక్టర్ శ్రీకార్తిక్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో రీతూ వర్మ కథానాయికగా నటించగా.. అక్కినేని అమల.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలలో నటించారు. విడుదలైన మొదటి రోజే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ. ఈ సినిమా చూసిన నాగార్జున ఎమోషనల్ అయ్యారు కూడా.. అయితే అమల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు అక్కినేని యంగ్ హీరో అఖిల్ హాజరుకాలేదు.

ప్రీరిలీజ్ ఈవెంట్ కు అఖిల్ హాజర్ఫావుతాడని ప్రకటించారు. కానీ అఖిల్ రాలేదు. దాంతో అఖిల్ ఎందుకు రాలేదు అన్న చర్చ తలెత్తింది. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకార్తీక్ మాట్లాడుతూ ఆ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. ఈ సినిమాను చూసిన అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత ఆయన మామూలు మనిషి కావడానికి రెండు రోజులు పట్టింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే ఎమోషనల్ గా తనని తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమని భావించే ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నాడు అని తెలిపాడు కార్తీక్. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే