Urvashi Rautela: మాట మార్చిన ఊర్వశి.. నేను సారీ చెప్పింది పంత్‌కు కాదు.. వారికే అంటూ..
Urvashi Rautela-Rishbah Pant: బాలీవుడ్ యంగ్ నటి ఊర్వశి రౌతెలా, టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్‌ల మధ్య సోషల్ మీడియాలో కోల్డ్‌వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చినా పంత్ వాటిని కొట్టిపారేశాడు.
Urvashi Rautela-Rishbah Pant: బాలీవుడ్ యంగ్ నటి ఊర్వశి రౌతెలా, టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్‌ల మధ్య సోషల్ మీడియాలో కోల్డ్‌వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చినా పంత్ వాటిని కొట్టిపారేశాడు. ఇదే సమయంలో మిస్టర్ ఆర్‌పీ అంటూ ఊర్వశి చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘కొందరు క్రేజ్, పాపులారిటీ కోసం ఏమైనా చేస్తారు. భగవంతుడు వారిని చల్లగా చూడాలి’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి ప్రతిగా ‘బ్యాట్ బాల్‌తో ఆడుకో తమ్ముడూ. రక్షాబంధన్ శుభాకాంక్షలు’ అని కౌంటర్ ఇచ్చింది. ఇక ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో భారత్ -పాక్ మ్యాచ్ సందర్భంగా వీరి వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో పాక్ ఆటగాడు నసీమ్‌షాతో ఊర్వశి రీల్స్ చేసి సరికొత్త చర్చకు దారి తీసింది.
కాగా మంగళవారం (సెప్టెంబర్ 13)న ఓ బాలీవుడ్ రిపోర్టర్ ఊర్వశిని ‘మీరు ఆర్పీకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా’ అని అడగ్గా..ఐయామ్ సారీ అంటూ చేతులు జోడించి మరీ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఊర్వశి-పంత్‌ల మధ్య వివాదం సమసిపోయిందని అంతా భావించారు. దీనికి సంబంధించి కొందరు సోషల్‌మీడియాలో విచ్చిల విడిగా కామెంట్లు కూడా పెట్టారు. అయితే తాజాగా ఊర్వశి మాట మార్చింది. ‘నేను సారీ చెప్పింది ఆర్పీకి కాదు..నా ఫ్యాన్స్‌కు’ అంటూ షాక్ ఇచ్చింది. దీంతో వీరి వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.