Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: విలేకరిపై కోపంతో ఊగిపోయిన తాప్సీ.. ఆ క్వశ్చన్ అడగడంతో సహనం కోల్పోయిన హీరోయిన్..

ఈ అవార్డ్స్ వేడుకల అనంతరం మీడియాతో ముచ్చటిస్తున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై తాప్సీ ఫైర్ అయ్యింది. ఆగ్రహంతో ఊగిపోతూ సదరు విలేకరిపై మండిపడింది. ప్రశ్నలు అడిగేటప్పుడు హోంవర్క్ చేసుకుని రాలేరా అంటూ విరుచుకుపడింది.

Taapsee Pannu: విలేకరిపై కోపంతో ఊగిపోయిన తాప్సీ.. ఆ క్వశ్చన్ అడగడంతో సహనం కోల్పోయిన హీరోయిన్..
Tapsee
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2022 | 7:32 AM

టాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్నూ (Taapsee Pannu) ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. వరుస సినిమాలతో తెగ బిజీ అయ్యింది. ఇటీవలే దొబారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ పంజాబీ భామా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించినంతస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా హీరోయిన్ తాప్సీ.. ఓటీటీ ప్లే అవార్డ్స్ 2022 వేడుకలకు హాజరయ్యింది. ఈ అవార్డ్స్ వేడుకల అనంతరం మీడియాతో ముచ్చటిస్తున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై తాప్సీ ఫైర్ అయ్యింది. ఆగ్రహంతో ఊగిపోతూ సదరు విలేకరిపై మండిపడింది. ప్రశ్నలు అడిగేటప్పుడు హోంవర్క్ చేసుకుని రాలేరా అంటూ విరుచుకుపడింది.

వివరాల్లోకెలితే.. ఓటీటీ ప్లే అవార్డ్స్ 2022 వేడుకలకు పాల్గోన్న తాప్సీ అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గోంది. అందులో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె నటించిన దొబారా సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్ గురించి ఓ విలేకరి అడగ్గా.. నెగిటివ్ టాక్ బారిన పడని చిత్రమేదైనా ఉందా ? అంటూ రివర్స్ అడిగింది తాప్సీ. దీంతో మరో ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించగా.. మధ్యలో తాప్సీ కలగజేసుకుంటూ.. ముందు నా ప్రశ్నకు సమాధానం చెబితే మీకు నేను సమాధానం చెబుతా.. చెప్పండి. ఏ చిత్రానికి నెగిటివ్ టాక్ రాలేదు అంటూ సీరియస్ అయ్యింది. దీంతో సదరు విలేకరి స్పందిస్తూ.. సినిమాలను విమర్శకులు కూడా మెచ్చుకోలేదు కాదా ? అని అనగా.. ఇలాంటి ప్రశ్నలు నన్ను అడిగేముందు కాస్త్ హోంవర్క్ చేసుకుని రండి. అలాగే మేం ఏం మాట్లాడిన మాకు మార్యద లేదు అంటారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాప్సీ తీరుపై కొందరు అసహనం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Mamaraazzi (@mamaraazzi)

ఇటీవల దొబారా సినిమా ప్రమోషన్లలోనూ విలేకర్లకు.. తాప్సీకి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఫోటోస్ కోసం తాప్సీ స్టిల్స్ ఇవ్వకుండా వెళ్లిపోవడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు రిపోర్టర్స్. దీంతో తాప్సీకి.. ఫోటోగ్రాఫర్స్ కు మాధ్య మాటల యుద్ధం నడిచింది.