డయానా ఉసురు తగిలింది.. ఆమె మహారాణి అయినా ఏం లాభం ??

డయానా ఉసురు తగిలింది.. ఆమె మహారాణి అయినా ఏం లాభం ??

Phani CH

|

Updated on: Sep 15, 2022 | 8:48 PM

క్యామిల్లా ఇకపై బ్రిటన్‌కు మహారాణిగా వ్యవహరించబోతోంది. కానీ.. ఇక్కడే క్యామిల్లా కలలో కూడా ఊహించని కొన్ని అభ్యంతరాలతో బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో అడుగుపెట్టబోతోంది.

క్యామిల్లా ఇకపై బ్రిటన్‌కు మహారాణిగా వ్యవహరించబోతోంది. కానీ.. ఇక్కడే క్యామిల్లా కలలో కూడా ఊహించని కొన్ని అభ్యంతరాలతో బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో అడుగుపెట్టబోతోంది. తలపై కీరిటంతో ఉత్త మహారాణి ట్యాగ్‌తో మాత్రం ఇకపై ఆమె జీవించాల్సి ఉంటుంది. 75 ఏళ్ల క్యామిల్లా.. కొత్త మహారాణి. కానీ, ఆమెకు ఎలాంటి సార్వభౌమాధికారాలు ఉండవు. ఎందుకంటే ఆమెకు రాణి హోదా బదులు.. క్వీన్‌ కాన్సోర్ట్‌గా రాజు భార్యగా మాత్రమే హోదా ఉంది కాబట్టి. అంతకంటే ముఖ్యంగా ఆమె చార్లెస్‌కు రెండో భార్య కాబట్టి. అవును.. ఛార్లెస్‌ మొదటి భార్య ప్రిన్సెస్‌ డయానా 1997లో రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే వీళ్ల విడాకులకు ముందు.. క్యామిల్లాతో ఎఫైర్‌ నడిపారు ఛార్లెస్‌. ఈ క్రమంలో క్యామిల్లా వల్లే డయానా-ఛార్లెస్‌లు విడిపోయారనే వాదన బలంగా వినిపించింది అప్పట్లో. ఆ పై డయానా నుంచి విడాకులు తీసుకున్న ఛార్లెస్‌.. 2005లో క్యామిల్లాను వివాహం చేసుకున్నారు. ఆపై ఆమె హోదాను ప్రిన్సెస్‌ కాన్సోర్ట్‌ నుంచి క్వీన్‌ కాన్సోర్ట్‌కు మార్చేశారు. పూర్తిస్థాయి ‘క్వీన్‌’ హోదా లేకపోవడంతో ఆమె నామమాత్రపు మహారాణిగానే బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో నివసించబోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెడచుట్టూ కొడవలి.. కాలికి తాళం.. బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు..

బ్రేక్ వేయబోతుండగా బస్సు డ్రైవర్‌కు ఊహించని షాక్ !! కనిపించిన నాగుపాము.. చివరికి ఏం జరిగిందంటే ??

Digital TOP 9 NEWS: కీడు సోకిందంటూ చెట్ల కింద ఉంటున్న గ్రామస్తులు | పది అడుగుల పాము బుసలు కొడితే..

Digital News Round Up: రెమ్యూనిరేషన్‌లో తగ్గేదే లే! | మాజీ సీఎం పరుగులెట్టించిన ఏనుగు ..లైవ్ వీడియో

TOP 9 ET News: హీరో చెంప చెళ్లుమనిపించిన సెక్యూరిటీ గార్డ్‌ | నివేదా లుక్‌ పై ట్రోల్స్

Published on: Sep 15, 2022 08:48 PM