Viral Video: మచ్చిక చేసుకున్న వాడికే చుక్కలు చూపించిందిగా.. వైరల్ అవుతోన్న మొసలి దాడి దృశ్యాలు..
Viral Video: జూలో ఉండే వాళ్లు చాలా శిక్షణ తీసుకొని ఉంటారు. కృర జంతువులను సైతం మచ్చిక చేసుకొని వాటితో ఆటలాడుతుంటారు. అయితే అవే జంతువులు ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది.?
Viral Video: జూలో ఉండే వాళ్లు చాలా శిక్షణ తీసుకొని ఉంటారు. కృర జంతువులను సైతం మచ్చిక చేసుకొని వాటితో ఆటలాడుతుంటారు. అయితే అవే జంతువులు ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది.? గుండె చేతులోకి రావడం ఖాయం కదూ.! తాజాగా ఇలాంటి ఓ సంఘటనే సౌతాఫ్రికాలో చోటు చేసుకొంది. ఓ జూకీపర్‌పై మొసలి దాడి చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికాలోని క్వాజులా నాటల్ ప్రావిన్స్‌లోని క్రోకోడైల్ క్రీక్‌లో షాన్ లె క్లస్ అనే వ్యక్తి మొసళ్ల బాధ్యత చూసుకుంటాడు.
16 అడుగుల పొడవుండే ఈ మొసలి 660 కేజీల బరువు ఉంటుంది. టూరిస్టులకు ఆ మొసలిని షాన్ పరిచయం చేశాడు. ఈ సమయంలో హానిబల్ పక్కనే మరో ఆడ మొసలి కూడా ఉంది. హానిబల్‌పై షాన్ కూర్చొని ఉండటం చూసిన అది పక్కకు మరలింది. అది గమనించిన షాన్ వెంటనే పక్కకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అలా షాన్ తన వీపు మీద నుంచి దిగగానే పక్కకు తిరిగిన హానిబల్.. అతని కాలును గట్టిగా పట్టుకొని పక్కకు విసిరేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సుమారు 30 ఏళ్లుగా ఈ మొసలి బాగోగులు చూసుకుంటున్నాడు షాన్.
క్రెడిట్: ఇండియా టుడే
ఈ ప్రమాదం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని జూ నిర్వాహకులు అంటున్నారు. పక్కనే ఉన్న ఆడ మొసలి వల్లనే హానిబల్ ఇలా ప్రవర్తించి ఉంటుందని భావిస్తున్నారు. షాన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని కూడా నిర్వాహకులు తెలిపారు. అతని కాలిపై రెండు దంతాల గాయాలు అయ్యాయని, అయితే తనకు తనే కుట్లు వేసుకున్న షాన్.. 20 నిమిషాల తర్వాత మళ్లీ పనిలోకి వచ్చేశాడని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..