Crime News: ప్రమోషన్‌ ఇవ్వలేదని బాస్‌ కుటాంబానే కడతేర్చాడు.. 8 ఏళ్లుగా తప్పించుకుంటున్నా, వదలని విధి..

Viral: ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ ప్రమోషన్‌ రావాలని కోరుకుంటారు. అందుకోసమే కష్టపడి పనిచేస్తారు. ఒకవేళ ఆశించిన ప్రమోషన్‌ రాకపోతే చేసేది ఏముందని సర్దుకుపోతారు. లేదా మరో ఆఫీస్‌ చూసుకొని వెళ్లిపోతారు...

Crime News: ప్రమోషన్‌ ఇవ్వలేదని బాస్‌ కుటాంబానే కడతేర్చాడు.. 8 ఏళ్లుగా తప్పించుకుంటున్నా, వదలని విధి..
Representative Image
Follow us

|

Updated on: Sep 23, 2022 | 8:30 AM

Viral: ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ ప్రమోషన్‌ రావాలని కోరుకుంటారు. అందుకోసమే కష్టపడి పనిచేస్తారు. ఒకవేళ ఆశించిన ప్రమోషన్‌ రాకపోతే చేసేది ఏముందని సర్దుకుపోతారు. లేదా మరో ఆఫీస్‌ చూసుకొని వెళ్లిపోతారు. సాధారణంగా ఎవరైనా చేసేది ఇదే.. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ప్రమోషన్‌ ఇవ్వలేదన్న కారణంతో ఏకంగా బాస్‌ కుటుంబాన్ని కడతేర్చాడు. ఇంతటి దారుణ సంఘటన ఎక్కడ జరిగింది.? చివరికి అతడు ఎలా దొరికాడు లాంటి విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లా్సిందే..

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ ఆయిల్‌ కంపెనీలో షాంగ్‌ లూ అనే ఓ వ్యక్తి తనను వేరే విభాగానికి ప్రమోట్‌ చేయాలని తన బాస్‌ను కోరాడు. కానీ లూకు ప్రమోషన్‌ రాలేదు. అంతేకాకుండా సహోద్యోగులు అతన్ని చులకనగా చూడడం మొదలుపెట్టారు. ప్రమోషన్‌ ఇవ్వకపోగా ఆఫీస్‌లో తన గురించి తప్పుగా ప్రచారం చేశాడనే అనుమానంతో బాస్‌పై కోపం పెంచుకున్నాడు. ఈ విషయంలో బాస్‌తో గొడవకు కూడా దిగాడు.

ఇది జరిగిన కొన్ని రోజులకే 2014 జనవరి 30న మవోయే సన్‌ తోపాటు ఆయన భార్య , ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. నలుగురు వ్యక్తుల శరీరాలపై బుల్లెట్‌ గాయాలుండటంతో పోలీసులు అనుమానంతో లూని విచారించారు. అయితే ఆ హత్యలు తాను చేయలేదని ఫాంగ్‌ లూ బుకాయించాడు. పోలీసులు.. నమూనాలను డీఎన్‌ఏ పరీక్షకు పంపించారు. ఆ ఫలితాలు వచ్చి, అతడిపై వారెంట్‌ జారీచేసే నాటికి నిందితుడు చైనాకు పారిపోయాడు. దీంతో అప్పటినుంచి ఆ కేసు విచారణ మరుగునపడిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇదంతా జరిగిన 8 ఏళ్ల తర్వాత సెప్టెంబర్‌ 11న నిందితుడు చైనా నుంచి అమెరికాకు తిరిగి వచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గతంలో సంఘటన స్థలం నుంచి సేకరించిన నమూనాలతో నిందితుడి డీఎన్‌ఏని పోల్చి చేశారు. సరిపోవడంతో హత్యానేరం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. చేసిన తప్పుకు ఎన్నేళ్లకైనా శిక్ష అనుభవించకతప్పదు అనే నానుడికి ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..