AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: బట్టలు లేకుండా రోడ్డుపై నడిచిన బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. తల్లిదండ్రులిచ్చిన వాంగ్మూలం వింటే షాక్

భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బాలిక తండ్రి స్పందించారు. తన కూతురు మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పాడు. అంతేకాదు.. తన కూతురికి ఏమీ కాలేదని.. అందరూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

Uttar Pradesh: బట్టలు లేకుండా రోడ్డుపై నడిచిన బాలిక కేసులో కొత్త ట్విస్ట్.. తల్లిదండ్రులిచ్చిన వాంగ్మూలం వింటే షాక్
Up News In Telugu
Surya Kala
|

Updated on: Sep 22, 2022 | 6:59 PM

Share

Uttar Pradesh: యూపీలోని మొరాదాబాద్‌లో బట్టలు లేకుండా రోడ్డుమీద నడిచిన బాలిక కేసులో తండ్రి ఇచ్చిన వాంగ్మూలంతో కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసును అత్యాచారం కోణంలో విచారించారు. అయితే కూతురిపై అత్యాచారం చేసిన ఘటనను తండ్రి తీవ్రంగా ఖండించారు. తన కూతురు మానసిక వికలాంగురాలని అని తండ్రి చెప్పాడు. వాస్తవానికి.. ఈ బాలిక వీడియో బయటకు వచ్చిన తర్వాత.. ఆ అమ్మాయి మామ కొంతమంది  అత్యాచారం చేశారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు విచారణ చేయడం మొదలు పెట్టారు.

అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలు ప్రారంభించారు. అలాగే ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం వెదుకుతున్నారు. భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై బాలిక తండ్రి స్పందించారు. తన కూతురు మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పాడు. అంతేకాదు.. తన కూతురికి ఏమీ కాలేదని.. అందరూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వ్యక్తి ..బాలికకు మేనమామ. తన పరువు తీసేందుకు తన బావమరిది ప్రయత్నం చేస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశాడు బాలిక తండ్రి. తాను ఈ వీడియో ఘటనలపై ఎటువంటి చర్యలు కోరడం లేదని చెప్పాడు. .

ఇవి కూడా చదవండి

బాలిక నగ్నంగా నడిచిన సమయంలో గ్రామంలో జాతర జరుగుతోందని గ్రామపెద్దలు చెబుతున్నారు. అందరూ జాతరలో బిజీబిజీగా ఉన్నారు. గ్రామంలో కొందరి కారణంగా తాము చిక్కుల్లో పడుతున్నామని వాపోతున్నారు. నిందితుల్లో గ్రామంలో ఒక వ్యక్తి కుమారుడి పేరు కూడా ఉంది. అయితే ఆ యువకుడికి  ఈ అమ్మాయి ఎవరో తెలియదని చెబుతున్నారు. అంతేకాదు.. ఆ అమ్మాయి తరచూ బట్టలు విప్పి నడుచుకుంటూ ఇలా వెళ్తూనే ఉంటుందని చెబుతున్నారు. గ్రామానికి చెందిన మరో వ్యక్తి కూడా ఈ విషయం అబద్ధమని, సంఘటన జరిగిన సమయంలో గ్రామంలో లేని వారి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారని చెప్పారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపిస్తే నిజం వెలుగులోకి వస్తుందని చెప్పాడు.

పోలీసుల దర్యాప్తు:  ఈ ఘటనపై రూరల్ ఎస్పీ సందీప్ కుమార్ మీనా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7న భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో తన మేనకోడలుపై అత్యాచారం జరిగిందని బాలిక మేనమామ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక, ఆమె తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌తో పాటు మరికొందరి వాంగ్మూలం కూడా తీసుకున్నామని చెప్పారు. తల్లిదండ్రులు తమ కుమార్తెపై అత్యాచారం వార్తలను ఖండించారు. మరికొందరు ఇదే విషయాన్నీ ధృవీకరించారు. ఇది ఇలా ఉండగా.. వీడియో ఆధారంగా యువకుడిని పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మిగిలిన చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..