AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: బ్యూటీ విత్ బ్రెయిన్.. కొత్త బిజినెస్ షురూ చేసిన కాజల్..

15 ఏళ్లుగా టాలీవుడ్‌తో విడదీయరాని అనుబంధం ఉంది కాజల్‌కు. ఏదో రెండేళ్లు గ్యాప్ వచ్చినంత మాత్రానా.. చందమామను అభిమానులు మరిచిపోవాలంటే కష్టమే.

Kajal Aggarwal: బ్యూటీ విత్ బ్రెయిన్.. కొత్త బిజినెస్ షురూ చేసిన కాజల్..
Kajal Aggarwal
Ram Naramaneni
|

Updated on: Sep 23, 2022 | 8:35 PM

Share

Tollywood: కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమాలు చేస్తారా చేయరా అనే అనుమానం అందరిలోనూ ఉంది. అయితే ఒప్పుకున్న సినిమాలు మాత్రం పూర్తి చేయాలని ఫిక్సయ్యారు చందమామ. ఆ తర్వాత ఫ్యూచర్ ప్లాన్ మాత్రం చెప్పట్లేదు. కానీ సినిమాలను మించిన ప్లానింగ్ మాత్రం చేసుకుంటున్నారు. సమంత స్నేహితురాలితో కలిసి బిజినెస్ షురూ చేసారు. మరి ఈ సమయంలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా లేదంటే గత జ్ఞాపకంగా మిగిలిపోనున్నారా..? ఒకటి రెండు కాదు.. 15 ఏళ్లుగా టాలీవుడ్‌తో విడదీయరాని అనుబంధం ఉంది కాజల్‌కు. ఏదో రెండేళ్లు గ్యాప్ వచ్చినంత మాత్రానా.. చందమామను అభిమానులు మరిచిపోవాలంటే కష్టమే. 2020లో గౌతమ్ కిచ్లు(Gautam Kitchlu)ను పెళ్లాడిన తర్వాత.. కొత్త సినిమాలకి సైన్ చేయడమే మానేసారు కాజల్. పైగా ఈ మధ్యే బిడ్డకు తల్లైన కాజల్.. సినిమాల గురించి ఆలోచించట్లేదు. కొడుకే ప్రపంచంగా ఉన్న ఈమె.. ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నారు.

తన కొడుకు నెయిల్ కిచ్లుకు 5 నెలలు రావడంతో.. తన ఫోకస్ వేరే వాటివైపు షిఫ్ట్ చేస్తున్నారు కాజల్. అప్పట్లో సైన్ చేసిన భారతీయుడు 2 పూర్తి చేయనున్నారు చందమామ. ఇప్పటికే సెట్స్‌లోకి అడుగు పెట్టారు ఈ బ్యూటీ. ఇది అయిపోయాక.. కాజల్ ఆలోచనలు పూర్తిగా బిజినెస్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చెల్లి నిషా అగర్వాల్‌తో కలిసి జ్యూవెలరీతో పాటు ఫుట్ వేర్ బిజినెస్ చేస్తున్నారు కాజల్. తాజాగా మరో బిజినెస్ మొదలుపెట్టారు కాజల్. సమంత స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి కేర్ అండ్ కేరాస్ అంటూ బేబీ ప్రాడక్ట్స్‌ షురూ చేసారు చందమామ. చిన్న పిల్లలకు కావాల్సిన ఫుడ్, అప్పుడే పుట్టిన బేబీస్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా ఇంకా ఎన్నో విషయాలను తన రీసర్చ్ టీమ్‌తో కలిసి కూర్చుని ఈ బిజినెస్ స్టార్ట్ చేసారు కాజల్. మొత్తానికి ఈమె తీరు చూస్తుంటే.. మునపటి కాజల్‌ను చూడటం కష్టమే అనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి