Tollywood: దసరాకు చుక్కలే.. థియేటర్స్ మ్యాటర్‌లో సరదా తీరిపోవడం ఖాయం.. బరిలో దిగుతున్న హీరోస్..
టాలీవుడ్‌లో సమ్మెలు.. టికెట్ రేట్లపై యుద్ధాలు.. నిర్మాతల మధ్య గొడవలు అయిపోయాయి. ఇప్పుడంతా సినిమా మాట్లాడుతుంది. కొన్ని వారాలుగా వరస సినిమాలు వస్తున్నాయి.
టాలీవుడ్‌లో సమ్మెలు.. టికెట్ రేట్లపై యుద్ధాలు.. నిర్మాతల మధ్య గొడవలు అయిపోయాయి. ఇప్పుడంతా సినిమా మాట్లాడుతుంది. కొన్ని వారాలుగా వరస సినిమాలు వస్తున్నాయి. అయితే అసలైన పరీక్ష మాత్రం దసరాకే ఉండబోతుంది. నిర్మాతలు చెప్తున్నట్లు చిన్న సినిమాలకు నిజంగా న్యాయం జరుగుతుందా..? చిరు, నాగ్‌తో పోటీ పడుతున్న మంచు విష్ణు, బెల్లంకొండ గణేష్ సినిమాలకు థియేటర్స్ దొరుకుతాయా..? ఇండస్ట్రీలో అంతా ఇప్పుడు దసరా సినిమాల గురించి చర్చ జరుగుతుంది. అయితే అందరి దృష్టి మాత్రం కేవలం చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ సినిమాలపైనే ఉంది. అక్టోబర్ 5నే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. పెద్ద బడ్జెట్‌తో వస్తున్న సినిమాలు కావడం.. స్టార్ హీరోలు ఉండటంతో అంతా ఈ పోరు గురించి చర్చించుకుంటున్నారు కానీ అదే రోజు మరో రెండు సినిమాలు వస్తున్నాయి. అక్టోబర్ 5నే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నాతో పాటు బెల్లంకొండ గణేష్ బాబు జిన్నా కూడా రానున్నాయి.
చిరు, నాగ్‌తో పోలిస్తే వీటి రేంజ్ చాలా తక్కువ. అయినా కూడా తమ కంటెంట్‌పై నమ్మకంతో స్టార్ హీరోలతో పోటీకి సిద్ధమయ్యారు ఈ ఇద్దరు హీరోలు. అయితే ఈ సినిమాలకు సరిపడా స్క్రీన్స్ దొరుకుతాయా అనేది ఇప్పుడు అందరి మదిలోనూ ఉన్న అనుమానం. స్టార్ హీరోలు బరిలో ఉన్నపుడు.. చిన్న సినిమాలు తప్పుకోవడం ఎప్పట్నుంచో జరుగుతుంది. నిజానికి స్వాతిముత్యం సినిమా ఆగస్టులోనే రావాల్సి ఉన్నా.. బింబిసార, సీతా రామం లాంటి సినిమాల కోసం తప్పుకుంది. మరి అప్పుడే దొరకని థియేటర్స్ దసరాకు దొరుకుతాయా అనేది అనుమానమే. మరోవైపు మంచు విష్ణు సైతం జిన్నాతో వస్తున్నారు.. ఈయన పరిస్థితి అగమ్యగోచరమే. గాడ్ ఫాదర్ సినిమాను నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. పైగా అక్కడున్నది చిరంజీవి కాబట్టి.. థియేటర్స్ సమస్య ఉండదు. మరోవైపు ది ఘోస్ట్‌ను నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు ఏషియన్ ఫిల్మ్స్. అంటే అక్టోబర్ 5న తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లో చూసినా ఈ రెండు సినిమాలే కనిపించనున్నాయి. మరి ఇలాంటి సమయంలో సమ్మె తర్వాత స్టార్స్‌తో పోటీగా విడుదలవుతున్న చిన్న సినిమాలకు ఏ మేరకు న్యాయం జరగనుందో దసరా వస్తే తెలిసిపోతుంది.
మరిన్ని వీడియోస్ కోసం: Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..