Liger Movie: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ లైగర్.. ఎక్కడ చూడొచ్చంటే?
Liger OTT Release: టాలీవుడ్ రౌడీ విజయ్‌దేవరకొండ నటించిన చిత్రం(Liger ). డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్యాపాండే విజయ్ సరసన నటించింది.
Liger OTT Release: టాలీవుడ్ రౌడీ విజయ్‌దేవరకొండ నటించిన చిత్రం(Liger ). డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్యాపాండే విజయ్ సరసన నటించింది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య గతనెల 25న విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే విజయ్ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కాగా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు డిస్నీ+హాట్‌స్టార్ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు (సెప్టెంబరు 22) నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో లైగర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కాగా భారీ బడ్జెట్‌తో లైగర్ సినిమాను పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. అందుకు తగ్గట్లే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని హాట్‌స్టార్‌తో మేకర్స్ డీల్ కుదిరించుకున్నారు. అయితే సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో హాట్‌స్టార్ ముందు అనుకున్న దానికంటే స్ట్రీమింగ్ చేస్తోంది. మరి థియేటర్లలో లైగర్‌ను చూడలేని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి .
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..