Aishwarya Rai: అందాల ఐశ్వర్య మళ్లీ అమ్మ కానుందా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Ponniyin Selvan1: 2018లో విడుదలైన ఫన్నేఖాన్ సినిమాలో చివరిసారిగా కనిపించింది నీలికళ్ల సుందరి ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai). ఆతర్వాత సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించలేదు.
Ponniyin Selvan1: 2018లో విడుదలైన ఫన్నేఖాన్ సినిమాలో చివరిసారిగా కనిపించింది నీలికళ్ల సుందరి ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai). ఆతర్వాత సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించలేదు. ఈ నాలుగేళ్ల గ్యాప్ లోటు తీర్చేలా ఏకంగా డబుల్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోందీ అందాల తార. మణిరత్నం దర్శకత్వంలో ఆమె నటించిన పొన్నియన్ సెల్వన్ సెప్టెంబర్30న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఆమె నందినీ, మందాకిని దేవి అనే రెండు పాత్రలను పోషించింది. ఈనేపథ్యంలో సుమారు నాలుగేళ్ల తర్వాత ఐశ్వర్య ను సిల్వర్‌స్ర్కీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పటివరకు విడుదలైన పాటలు, ఐశ్వర్య లుక్స్ అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రబృందం. ఐశ్వర్య కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈక్రమంలో ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంటపడింది ఐశ్వర్య. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఈ వీడియోలో వైట్ ఓవర్‌కోట్ వేసుకుని ఎంతో అందంగా కనిపించింది ఐశ్వర్య. ఇదే సమయంలో ఆమెను చూసిన నెటిజన్లు ఆమె మళ్లీ అమ్మ కానుందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే శుభవార్త చెప్పొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఐశ్వర్య గర్భవతి అని ప్రచారం జరగడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె వేషధారణను చూసి ఇలాంటి రూమర్లు చాలా పుట్టుకొచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుని బిగ్‌బీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది ఐశ్వర్య. 2016లో అభిషేక్- ఐశ్వర్య దంపతులకు ఆరాధ్య అనే కూతురు జన్మించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..