Tanushree Dutta: కారు బ్రేకులు ట్యాంపరింగ్‌ చేశారు.. విష ప్రయోగం చేశారు.. మరోసారి సెన్సేషనల్ కామెంట్స్‌ చేసిన హీరోయిన్

Tanushree Dutta: ఆషిక్‌ బనాయా ఆప్నే అంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా. తెలుగులో బాలయ్యతో కలిసి వీరభద్ర సినిమాలో నటించి మెప్పించిందీ అందాల తార.

Tanushree Dutta: కారు బ్రేకులు ట్యాంపరింగ్‌ చేశారు.. విష ప్రయోగం చేశారు.. మరోసారి సెన్సేషనల్ కామెంట్స్‌ చేసిన హీరోయిన్
Tanushree Dutta
Follow us
Basha Shek

|

Updated on: Sep 24, 2022 | 6:53 AM

Tanushree Dutta: ఆషిక్‌ బనాయా ఆప్నే అంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా. తెలుగులో బాలయ్యతో కలిసి వీరభద్ర సినిమాలో నటించి మెప్పించిందీ అందాల తార. కాగా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ మీటూ ఉద్యమం, క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలతోనూ వార్తల్లో నిలిచింది. ఓ సినిమా షూటింగ్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈనేపథ్యంలో ఆమెపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగినట్లు మరోసారి సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసింది తనుశ్రీ. ‘నేను ఉజ్జయినిలో ఉన్నప్పుడు.. నా కారు బ్రేకులను ఎవరో రెండుసార్లు ట్యాంపరింగ్ చేశారు. దీని వల్ల నాకు చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. నా గాయాలు పూర్తిగా నయం కావడానికి చాలా సమయం పట్టింది’ అని గత అనుభవాలను గుర్తు తెచ్చుకుంది.

కాగా ఇంకోసారి తనపై ఎవరో విష ప్రయోగానికి ప్రయత్నించారని తనుశ్రీ పేర్కొంది. ‘నా దగ్గర ఒక మహిళ పనిమనిషిగా పని చేస్తోంది. ఆమె వచ్చిన తర్వాతే నాకు చాలా జబ్బులు వచ్చాయి. నేను తాగే నీళ్లలో ఆమె ఏదో కలిపినట్లు అనిపించింది. అది నాకు విషంలా అనిపించింది’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార. కాగా క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణల కారణంగా నానాపటేకర్‌ను హౌస్‌ఫుల్‌3 సినిమాతో పాటు మరికొన్ని సినిమాల నుంచి తొలగించారు. అయితే జూన్ 2019లో.. అతనికి ఈ కేసు విషయంలో కోర్టు నుంచి క్లీన్‌చీట్‌ వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు