OTT: ఓటీటీ లవర్స్‌కి ఈ వారం జాతరే.. భారీ ఎత్తున సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సందడే సందడి..
తాజాగా ఓటీటీ వేదికగా భారీగా సినిమాలు/ వెబ్ సిరీస్‌లు సందడి చేసేందుకు సిద్ధమ్యాయి. దసరా సెలవులు ఇప్పటికే ప్రారంభం కావడంతో ఓటీటీ సంస్థలు ఫుల్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ...
OTT: ఒకప్పుడు థియేటర్లలో సినిమా విడుదలవుతుందంటే ఎంతో ఆతృతగా చూసేవారు. ఒక వారం నుంచే టికెట్ల కోసం కుస్తీలు పడేవారు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి, థియేటర్లతో పాటు ఓటీటీకి కూడా డిమాండ్ పెరిగింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా సినిమాల విడుదల కోసం ఎదురు చూసే రోజులు వచ్చాయి. అప్పటికే థియేటర్లలో చూసిన సినిమాలను మళ్లీ ఇంట్లో బిగ్ స్క్రీన్‌పై చూడాలని కోరుకునే వారు కొందరైతే, థియేటర్లలలో సినిమాను మిస్ అయిన వారు మరికొందరు ఓటీటీ బాటప డుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల నేరుగా ఓటీటీ వేదికగా కూడా సినిమాలు విడుదలవుతున్న సందర్భాలు చూస్తున్నాం.
వెబ్ సిరీస్‌లు ఓటీటీ మార్కెట్‌ను ఏలుతోన్న రోజుల్లో వాటికి కూడా భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓటీటీ వేదికగా భారీగా సినిమాలు/ వెబ్ సిరీస్‌లు సందడి చేసేందుకు సిద్ధమ్యాయి. దసరా సెలవులు ఇప్పటికే ప్రారంభం కావడంతో ఓటీటీ సంస్థలు ఫుల్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చాయి. మరి ఈ వారం ఓటీటీ వేదికగా సందడి చేయనున్న, ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోన్న సినిమాలపై ఓ లుక్కేయండి..
* ధన్‌రాజ్, సునీల్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన బుజ్జి ఇలారా చిత్రం అమెజాన్ ఓటీటీ వేదికగా సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* కన్నడంలో భారీ విజయాన్ని అందుకున్న 777 చార్లీ తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా చూడాలంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది (పే పర్‌వ్యూ).
* ఆర్య హీరోగా తెరకెక్కిన ‘కెప్టెన్’ తెలుగు, తమిళ్ వెర్షన్ జీ5లో సెప్టెంబ్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* విక్రమ్ అద్భుత నటనతో ఆకట్టుకున్న కోబ్రా చిత్రం ఇప్పటికే సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
* వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగరంగ వైభవంగా చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* హిందీలో వచ్చిన ప్లాన్ ఎ ప్లాన్ బి సెప్టెంబర్ 30 నుంచి నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
* హిందీలో తెరకెక్కిన కర్మ్ యుధ్ అనే వెబ్ సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* ఆహా తమిళ్ ఓటీటీ వేదికగా మ్యాడ్ కంపెనీ సెప్టెంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..