Adipurush: ఆదిపురుష్ పై అసంతృప్తి.. 100 సెకన్ల టీజర్‌లో 10 తప్పులంటూ ఓ రేంజ్ లోనెటిజన్లు ట్రోల్స్.. అవి ఏమిటో తెలుసా..

ఈ చిత్రం మహర్షి వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించబడిందని ఫిల్మ్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు, అయితే టీజర్‌లో అన్ని పాత్రలను చూపించిన విధంగా హిందూ గ్రంథం లేదా జానపద కథల్లో ప్రస్తావించలేదని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.  

Adipurush: ఆదిపురుష్ పై అసంతృప్తి.. 100 సెకన్ల టీజర్‌లో 10 తప్పులంటూ ఓ రేంజ్ లోనెటిజన్లు ట్రోల్స్.. అవి ఏమిటో తెలుసా..
Adipurush
Follow us
Surya Kala

|

Updated on: Oct 05, 2022 | 11:08 AM

Adipurush: దక్షిణాది సూపర్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ జంటగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలైంది.  ఈ టీజర్ పై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతుంది. మూవీ చిత్రీకరణలో కాపీ కొట్టే ప్రయత్నం చేశారని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ‘ఆదిపురుష్’ సినిమాలో జరిగిన పొరపాట్లను తాము జీర్ణించుకోలేకపోతున్నామని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మేకర్స్ 100 సెకన్ల టీజర్‌లో,  10 తప్పులు చేశారంటూ నెటిజన్లు ట్రోల్స్  చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను కూడా బాయ్‌కాట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఈ చిత్రం మహర్షి వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించబడిందని ఫిల్మ్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు, అయితే టీజర్‌లో అన్ని పాత్రలను చూపించిన విధంగా హిందూ గ్రంథం లేదా జానపద కథల్లో ప్రస్తావించలేదని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టీజర్‌లో మేకర్స్ చేసిన 10 తప్పుల గురించి తెలుసుకోండి:

  1. ఈ సినిమా టీజర్ చూసిన జనం చాలా నిరుత్సాహానికి గురయ్యారు. సినిమా వీఎఫ్‌ఎక్స్ చాలా దారుణంగా ఉందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే చిత్రంలోని వీఎఫ్‌ఎక్స్ కార్టూన్ లేదా యానిమేషన్ చిత్రాల కంటే అధ్వాన్నంగా ఉందని వినియోగదారులు తెలిపారు.
  2. సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించాడు. సైఫ్ ఈ లుక్ జనాలకు కూడా నచ్చలేదు. రావణుడి గెటప్ ను పూర్తిగా తిరస్కరించారు.  సైఫ్ అలీ ఖాన్ మోడరన్, స్టైలిష్ . స్పైక్ హ్యారీకట్‌లో కనిపిస్తాడు. ప్రజలు సైఫ్‌ని రావణుడు అని కాకుండా ఖిల్జీ అని పిలుస్తున్నారు.
  3. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ పై కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతని లుక్‌పై చాలా వివాదాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నాడు. ఆయన కాళ్లకు చెప్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ శ్రీ రాముడి ఈ విధంగా  చూపించలేదు.
  4. ఈ చిత్రంలో కృతి సనన్ మాత సీత పాత్రలో నటిస్తోంది. అయితే సీత లుక్‌పై జనాలు కూడా ప్రశ్నలు సంధించారు. టీజర్‌లో కృతి కనిపించిన లుక్‌తో పాటు ఆమె వేసుకున్న దుస్తులను కూడా కామెంట్ చేస్తున్నారు మహిళలకు ఆదర్శం సీత మాత. స్త్రీ, స్వచ్ఛతకు గుర్తు జనని.. ఆమెను చూపించిన విధానం తాము అంగీకరించలేమని అంటున్నారు.
  5. రావణబ్రహ్మ పుష్పక్ విమానానికి బదులుగా ఈ చిత్రంలో రావణుడి పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ డ్రాగన్ స్వారీ చేస్తున్నట్లు చూపించారు.  రావణుడు గొప్ప శివ భక్తుడు.. రాక్షసుడు కాదు.
  6.  టీజర్‌లో హనుమంతుడి లుక్ ను  చూసి సినీ ప్రేమికులు షాక తిన్నారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. టీజర్‌లో హనుమంతుడి దుస్తులు వింతగా ఉన్నాయని అన్నారు.  ఆయన మాట్లాడుతూ.. ‘ఆది పురుష్ టీజర్ చూశాను.  సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయి. మన విశ్వాసానికి కేంద్ర బిందువులను సినిమాలో చూపించిన విధానం అస్సలు కరెక్ట్ కాదన్నారు. ఇప్పుడు హనుమంతుడు  బట్టలు తోలుతో చేసినవిగా చూపించారు. ఇది ఖచ్చితంగా హిందూ విశ్వాసంపై దాడి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఇవి. అన్నారు.
  7. టీజర్‌లో దెయ్యాలు కనిపించే సన్నివేశాన్ని కూడా చూపించారు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత,  ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆదిపురుష్‌లో, రాముడు రాక్షసుల సైన్యంతో పోరాడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఏ హిందువులోనూ లేదా జానపద కథలోనూ ఇలాంటి చిత్రణ గురించి వినలేదు. ఈ సన్నివేశాలను హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టారు.
  8. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష’ టీజర్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ని పిల్లల ఆటలు ‘టెంపుల్‌ రన్‌’, ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో పోలుస్తున్నారు.
  9. ‘ఆదిపురుష’ నిర్మాతలను ప్రజలు ట్విట్టర్‌లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో పాటు దీనికి సంబంధించిన పలు మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మీమ్స్‌లో, చిత్రంలోని సన్నివేశాలను ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’తో పోల్చారు.
  10. టీజర్‌లో చూపించిన ప్రభాస్ సన్నివేశాలు క్రిస్ హెమ్స్‌వర్త్ చిత్రం ‘ఎక్స్‌ట్రాక్షన్’ సన్నివేశం నుండి కాపీ చేయబడ్డాయి. ఆ చిత్రంలో కూడా నీటి అడుగున ధ్యానం చేసే హూ-బు-హూ సన్నివేశం ఉంటుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..