Oke Oka Jeevitham: శర్వానంద్ లేటెస్ట్ సూపర్ హిట్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ అంటే
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు శర్వానంద్. అప్పుడప్పుడే మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్న శర్వా.
టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. చాలా కాలంగా శర్వానంద్ ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో శర్వా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు శర్వానంద్. అప్పుడప్పుడే మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్న శర్వా.. ఆ తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని తిరిగి అందుకోలేకపోయాడు. మొన్నీమధ్య ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తిరుమల కిషోర్ ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఆ తర్వాత ఒకేఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శర్వా. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్రలో కనిపించారు. శర్వా తల్లి పాత్రలో అక్కినేని అమల నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రీతువర్మ నటించింది.
ఇక ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 10న ఈ సినిమా ఓటీటీ వేదికగా రానుందని ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ లో ఒకేఒక జీవితం సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. థియేటర్స్ లో డీసెంట్ హిట్ గా నిలిచినఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..