Nagababu: అన్నయ్య మాటలు మనో ధైర్యాన్నిచ్చాయి.. ఆయన ఆశీస్సులతో తమ్ముడు తప్పకుండా పగ్గాలు చేపడతాడు: నాగబాబు

రు వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పందించారు. అన్నయ్య మాటలు కోట్లాది మంది తమ్ముళ్ల మనసులు గెలుచుకున్నాయని, ఆయన ఆశీస్సులతో తమ్ముడు తప్పకుండా పాలన పగ్గాలు చేపడతాడని మెగాబ్రదర్ ధీమా వ్యక్తం చేశారు

Nagababu: అన్నయ్య మాటలు మనో ధైర్యాన్నిచ్చాయి.. ఆయన ఆశీస్సులతో తమ్ముడు తప్పకుండా పగ్గాలు చేపడతాడు: నాగబాబు
Mega Brothers
Follow us

|

Updated on: Oct 05, 2022 | 6:25 AM

భవిష్యత్‌లో తన మద్దతు, తమ్ముడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ఉంటుందంటూ మెగాస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు బాగా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా  చిరు వ్యాఖ్యలపై మెగా బ్రదర్‌, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పందించారు. అన్నయ్య మాటలు కోట్లాది మంది తమ్ముళ్ల మనసులు గెలుచుకున్నాయని, ఆయన ఆశీస్సులతో తమ్ముడు తప్పకుండా పాలన పగ్గాలు చేపడతాడని మెగాబ్రదర్ ధీమా వ్యక్తం చేశారు. ‘జనసేనాని లాంటి నిబద్ధత వున్న నాయకుడు పరిపాలన పగ్గాలు చేపట్టాలనే అన్నయ్య గారి ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుంది. జన సైనికులుగా మేమంతా ఆ మహత్ కార్యాన్ని నెరవేర్చి చూపిస్తాం. పవన్ కల్యాణ్ నిజాయితీ, నిబద్ధత తనకు చిన్నప్పటి నుంచి తెలుసనే అన్నయ్య వ్యాఖ్యలు జనసైనికులకు మనో ధైర్యాన్ని ఇచ్చాయి. భవిష్యత్‌లో తాను ఏ పక్షాన ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని చిరంజీవి చెప్పిన మాటలకు అనుగుణంగా జనసైనికులంతా మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందుతాం’ అని నాగబాబు పేర్కొన్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ దసరా కానుకగా బుధవారం (అక్టోబర్‌ 5న)విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్పెషల్‌ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో చిరంజీవి తన తమ్ముడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు భవిష్యత్‌లో మద్దతిస్తానేమోనంటూ చిరంజీవి పేర్కొన్నారు. పవన్‌ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని.. పవన్ లాంటి నిబద్ధత కలిగిన నాయకులు రావాలంటూ ఆకాంక్షించారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని తెలిపారు. తామిద్దరం చెరోవైపు ఉండటం కంటే తాను తప్పుకోవడమే తన తమ్ముడు రాజకీయాల్లో రాణించడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే రాజకీయాల నుంచి తప్పుకున్నానంటూ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం  క్లిక్ చేయండి..