AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varsha Bollamma: ‘అలాంటి పాత్రలో నటించాలని ఆశపడుతున్నా’.. ఆసక్తికర విషయం తెలిపిన వర్ష

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో అందాలభామ వర్ష ఒకరు. హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు ఈ ముద్దుగుమ్మ.

Varsha Bollamma: 'అలాంటి పాత్రలో నటించాలని ఆశపడుతున్నా'.. ఆసక్తికర విషయం తెలిపిన వర్ష
Varsha Bollamma
Rajeev Rayala
|

Updated on: Oct 04, 2022 | 9:25 PM

Share

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో అందాలభామ వర్ష ఒకరు. హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు ఈ ముద్దుగుమ్మ. తమిళ, మలయాళ సినిమాలతో పాపులర్ అయిన వర్ష బొల్లమ్మకు తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో సక్సెస్ దక్కింది. ఆనంద్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ నటించడం నటించింది. ఇక ఇప్పుడు స్వాతి ముత్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్టాండ్ అప్ రాహుల్ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. ఇక బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా రేపు (అక్టోబర్ 5న ) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా వర్ష మాట్లాడుతూ..

సినిమాలో పాత్రల పరంగా చూస్తే నా పాత్ర కొంచెం డామినేటింగ్ గా ఉంటుంది. గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నేను పోషించిన భాగ్య లక్ష్మి పాత్ర ఒక స్కూల్ టీచర్. ఆ పాత్రకు తగ్గట్లు కొంచెం పెత్తనం చూపిస్తాను అని తెలిపింది. నిజాయితీగా చెప్పాలంటే ఇది మొదట సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా అని చెప్పారు. ఆ తర్వాత కథ చెప్పారు. సితార లాంటి పెద్ద సంస్థలో అవకాశం అనగానే చేయాలనుకున్నాను. అయితే కథ విన్నాక చాలా నచ్చింది. సినిమా ఖచ్చితంగా చేయాలి అనిపించింది.
నాకు ఇలా సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే ఇష్టం. ఈ కథలో కొత్తదనం ఉంది. పాత్రలలో చాలా లోతు ఉంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక నేను ఒక చిన్న టౌన్ నుండి వచ్చాను. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా చిన్నది జరిగినా పెద్దది చేసి మాట్లాడతారు. మన బంధువుల కుటుంబంలో ఏదైనా జరిగితే మన మాట్లాడుకుంటాం కదా.. అలా ఒక సాధారణ కుటుంబంలో జరిగే సన్నివేశాలు ఉంటాయి.  అలాగే చాలా మంది అడుగుతుంటారు. ఎక్కువగా హీరోల సోదరులతో చేస్తారు ఎందుకు అని. నేను కావాలని ఎంపిక చేసుకోలేదు. అది అలా కుదురుతుంది అంతే. ఇప్పుడు వస్తున్న యువ హీరోలు మంచి సబ్జెక్టులతో వస్తున్నారు. నన్ను తీసుకోవడానికి అది కూడా కారణమై ఉండొచ్చు. ఈ అమ్మాయి ఇలాంటి పాత్ర కూడా చేస్తుందా అని అనుకునే లాంటి పాత్ర చేయాలని ఉంది. ప్రతినాయిక ఛాయలు ఉన్న సైకో పాత్ర దొరికితే బాగా చేయగలనని నాకు నమ్మకం ఉంది..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..