Sekhar Kammula and Dhanush: ధనుష్ సినిమా పనుల్లో బిజీ బిజీగా శేఖర్ కమ్ముల.. పవర్ ఫుల్ కథతో రానున్న సెన్సబుల్ డైరెక్టర్

ఇక ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ధనుష్ ఇప్పుడు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్నారు.

Sekhar Kammula and Dhanush: ధనుష్ సినిమా పనుల్లో బిజీ బిజీగా శేఖర్ కమ్ముల.. పవర్ ఫుల్ కథతో రానున్న సెన్సబుల్ డైరెక్టర్
Dhanush, Sekhar Kammula
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 04, 2022 | 8:11 PM

తమిళ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలను అనుకున్నాయి. ఇక ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ధనుష్ ఇప్పుడు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్నారు. ఇటీవలే తిరు అనే సినిమాతో వచ్చిన ధనుష్. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సార్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ధనుష్‌కు జోడిగా సంయుక్త మీనన్‌ నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపడుతోంది.డిసెంబర్‌ 2న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. చివరిగా వచ్చిన లవ్ స్టోరీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు శేఖర్ కమ్ముల. ధనుష్ కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నాడు శేఖర్. ఇప్పటివరకు ఎప్పుడూ టచ్ చేయని కథను ఇప్పుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో ఈ సినిమా ఉంటుందా..? లేదా అన్న అనుమానాలు కలిగాయి.

అయితే ఎప్పటిలానే తన ప్రాజెక్టుకి సంబంధించిన పనులను శరవేగంగా చేసుకుంటూ వస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ వైపు నుంచి అన్ని పనులను పూర్తి చేశాడని అంటున్నారు. ఈ సినిమా కథ ముగింపు దశకి చేరుకున్నాయి. దాంతో ఈ సినిమాను జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకుని వెళ్లడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది. వెంకీ అట్లూరి సినిమా కంప్లీట్ అయిన వెంటనే శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!