Adipurush Teaser: రామాయణాన్ని తప్పుదోవ పట్టిస్తారా..? ‘ఆదిపురుష్’ టీజర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' మువీలో రామాయనాన్ని కొత్తగా చూపించేందుకు డైరెక్టర్ ఓం రౌత్ ప్రయత్నిస్తున్నాడు. ఐతే ఆదివారం విడుదలైన టీజర్ చూడటానికి బాగున్నప్పటికీ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే..
బాహుబలి మువీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ పాన్ ఇండియా స్టార్ నటించిన ‘ఆది పురుష్’ టీజర్ ఆదివారం(అక్టోబర్ 2న) సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2వ తేదీన అయోధ్య వేధికగా జరిగిన ఆదిపురుష్ ఈవెంట్‌లో టీజర్‌ను విదుదల చేసినప్పటి నుంచి 17 గంటల్లోనే రికార్డు స్థాయిలో అన్ని భాషల్లో కలిపి దాదాపు 88 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఐతే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ మువీలో రామాయనాన్ని కొత్తగా చూపించేందుకు డైరెక్టర్ ఓం రౌత్ ప్రయత్నిస్తున్నాడు. నిన్న విడుదలైన టీజర్ చూడటానికి బాగున్నప్పటికీ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే..
రెండు నిముషాల నిడివి గల ఈ సినిమా టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. చూసేందుకు కార్టూన్ మువీలా ఉందని, యానిమేషన్, బ్యాక్ గ్రౌండ్ గ్రాఫిక్స్ మేకర్స్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘భారీ అంచనాలు ఉన్న ఆదిపురుష్ మువీని వీడియో గేమ్ గ్రాఫిక్స్ లాగా చిత్రీకరించారు’. ‘VFX పేరుతో చరిత్రను తప్పు దోవ పట్టించొద్దు’. ‘సినిమా ఒరిజినల్‌గా కాకుండా యానిమేషన్ సినిమాలా కనిపిస్తుంది’. భగబన్ రామ్, హనుమాన్, జమ్వంత్, రబన్, ఇతర నటులు నిజమైన మనుషుల్లా కాకుండా బొమ్మల్లా కనిపిస్తున్నారు. లొకేషన్లు ఎక్కడివో, కాస్ట్యూమ్స్ ఎలాంటివో అర్థం కావట్లేదని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. డైరెక్టర్ ఓం రౌత్‌నైతే ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. రామాయణం కథ ఆధారంగా తీసిన ఈ సినిమా చిత్రీకరణ త్వరగా పూర్తి చేసినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది. కొంప తీసి గ్రాఫిక్స్ సినిమా కాదు కదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
#Adipurush Ravana was a pure Brahmin ,but Rama was a kshatriya warrior but how come rama is wearing janivara and why not Ravana who was a Brahmin? That’s north Indians for you .??? pic.twitter.com/oqupsW7yiM
— Likhith kannadiga (@likithgowda_) October 2, 2022
ఓ ట్విటర్ యూజర్ ఐతే మరీ దారుణంగా ఏకి పారేశాడు. ‘ఈ సినిమాలోని ప్రధాన పాత్రల ద్వారా వాస్తవికతను తప్పు దారి పట్టిస్తున్నారు. రావణుడు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు. రాముడు క్షత్రియ యోధుడు. అట్లాంటిది రాముడు జంధ్యం ఎలా ధరించాడు? రావణుడుడికి జంధ్యం ఏది? అసలు వీరిద్దరిలో ఎవరు బ్రాహ్మణుడు? అని విరుచుకు పడ్డాడు. టీజర్‌పై ఈ విధమైన విమర్శ రావడం మువీకి అంత శుభశూచకం కాదని మరికొందరు అంటున్నారు. కొన్ని సీన్స్ అయితే కింగ్ కాంగ్ సినిమాను తలపించేలా ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ ఇది నిజంగానే గ్రాఫిక్స్ సినిమా అయితే కంటెంట్ ఎంత బాగున్నా ప్రేక్షకులు ఖచ్చితంగా చూడటానికి ఇష్టపడరు. మరోవైపు ఈ ట్రోల్స్‌పై డైరెక్టర్ ఓం రౌత్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
Please ? Don’t ruin our history in the name of VFX. The film more look like anime movie rather than Original. Where is original location, costume, weapons etc. Bhagaban Ram, Hanuman, Jamwant, Raban and other actors doesn’t look like thier characters.#Adipurush ??
— ପିଙ୍କୁ (@ssatyabrat11) October 2, 2022
#Adipurush has Prabhu Ram fighting an army of rakshas imported from Evil Dead or Pirates of Caribbean.
Never heard of such depiction in any Hindu scripture or folklore pic.twitter.com/q80trYdHmf
— Gems of Bollywood बॉलीवुड के रत्न (@GemsOfBollywood) October 2, 2022
700 cr Temple Run???#Adipurush #AdipurushTeaser #AdipurushMegaTeaserLaunch #Disappointed #Animated pic.twitter.com/fH4B6k55iv
— Prem Sharma (@imprem858) October 2, 2022
Am I the only one who thinks Saif looks more like an IsIamic invαժer than Ravan in #Adipurush? pic.twitter.com/KdBHfy0Njt
— BHK?? (@BeingBHK) October 2, 2022
Had such high expectations from #Adipurush, looking like video game graphics pic.twitter.com/YA5IXKOdtq
— Jnura (@nafllaw) October 2, 2022
700 cr Temple Run???#Adipurush #AdipurushTeaser #AdipurushMegaTeaserLaunch #Disappointed #Animated pic.twitter.com/fH4B6k55iv
— Prem Sharma (@imprem858) October 2, 2022
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతివృత్తం ఆధారంగా ఆదిపురుష్ సినిమా రూపొందిస్తున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషతోపాటు హిందీ, తమిళ్, మళయాలం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధాలు చేస్తోంది.