Dasara movie: మాములు మాస్‌ బీట్‌ కాదు భయ్యో.. దుమ్ము రేపుతోన్న నాని దసరా ఫస్ట్‌ సింగిల్‌..

నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'దసరా'. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో...

Dasara movie: మాములు మాస్‌ బీట్‌ కాదు భయ్యో.. దుమ్ము రేపుతోన్న నాని దసరా ఫస్ట్‌ సింగిల్‌..
Dasara Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 04, 2022 | 10:22 AM

నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. రామగుండం బొగ్గు గనుల నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో నాని పూర్తి స్థాయి మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందులో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఫస్ట్‌లుక్‌, టీజర్స్‌తో ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసింది.

‘ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సాంగ్‌తో సినిమా ఎలా ఉండనుందని మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. దసరా పండుగను పురస్కరించుకొని విడుదల చేసిన ఈ పాట ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పాటలో తెలంగాణ జానపదం, యాస ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సాంగ్‌లో కనకవ్వ పాడిన ‘బతుకమ్మ’ పాటను కూడా చేర్చడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇక నాని లుక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెరీర్‌లో నాని తొలిసారి పూర్తి స్థాయిలో మాస్‌ లుక్‌లో కనిపించారు. బొగ్గు గనుల్లో పాటను చిత్రీకరించారు. సంతోష్‌ నారాయణ్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోర దాస లక్ష్మి గాత్రం అందించారు. వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ