Reliance Jio: కస్టమర్లకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్.. 4G ధరలకే 5G ప్లాన్స్!!
వినియోగదారులు అందరూ కూడా 5G సేవలలోని విలువను గుర్తించే వరకు కొత్త ధరలను అమలు చేసే ఆలోచన లేదని సంస్థలోని..
మొబైల్ వినియోగదారులకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ అందించింది. తొలుత 5G ప్లాన్స్‌ను 4G రేట్లకే అందిస్తామని.. ఎలాంటి అధిక ధరలను వసూలు చేయబోమని కంపెనీ వర్గాలు తెలిపాయి. వినియోగదారులు అందరూ కూడా 5G సేవలలోని విలువను గుర్తించే వరకు కొత్త ధరలను అమలు చేసే ఆలోచన లేదని సంస్థలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే.. జియో 5G సేవలు ప్రధాన మెట్రోపాలిటిన్ నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో దీపావళి కల్లా అందుబాటులోకి రానున్నట్లు జియో సంస్థ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే.
రూ. 15 వేలకే ల్యాప్‌టాప్.. జియో మరో సంచలనం.?
టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ అగ్రస్థానంలో దూసుకుపోతోంది రిలయన్స్ జియో. పోటీదారులకు ఎప్పటికప్పుడు ఛాలెంజ్‌లను విసురుతూ తక్కువ ధరకే రీచార్జ్ ప్లాన్స్ అందించడమే కాకుండా.. సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్దమవుతోంది. ‘జియోబుక్’ పేరిట అతి తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
4జీ ఆధారిత సిమ్‌తో ఈ ల్యాప్‌టాప్ వర్క్ చేస్తుందట. జియోబుక్ తయారీలో భాగంగా ఇప్పటికే రిలయన్స్ జియో.. క్వాల్‌కామ్, మైక్రోసాఫ్ట్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుందని సంస్థలోని ఉన్నతాధికారి ఒకరి తెలిపారు. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 15 వేలుగా నిర్ణయించినట్లు.. నవంబర్‌లో మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రిలయన్స్ జియో మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..