Mrunal Thakur: ”రెండు వారాలు ఓ వేశ్య గృహంలో ఉన్నా”.. షాకింగ్ విషయం చెప్పిన సీతారామం బ్యూటీ
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది ఈ భామ. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది అందాల భామ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాలూ సీతామహాలక్ష్మీ గా అద్భుతంగా నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకుంది ఈ భామ. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. దుల్కర్ కెరీర్ లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా వందకోట్లకు పైగా వసూల్ చేసింది. ఇదిలా ఉంటే మృణాల్ అంత ఈజీగా హీరోయిన్ అవ్వలేదు. చాలా స్ట్రగుల్స్ పడిందట. అయితే ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్
ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాల్. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రసారమై ఆ సీరియల్‌లో ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది. అయితే హీరోయిన్ గా ఈ చిన్నది మొదటి సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం దక్కించుకుందట. కానీ ఆ సినిమాలో నటించలేకపోయిందట. ఆ విషయాలను తాజాగా ఓ ఇంట్రవ్యూలో చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ సినిమాలో ముందుగా మృణాల్‌ను హీరోయిన్ గా అనుకున్నారట. ఈ సినిమాలో అనుష్క శర్మ చేసిన పాత్రలో మృణాల్ నటించాల్సి ఉంది. ఈ సినిమా కోసం ఫైటింగ్ లో కూడా శిక్షణ తీసుకుందట. అలాగే 11 కిలోల బరువు కూడా తగ్గిందట. అయితే ఆ తర్వాత ఆమెను కాదని అనుష్క శర్మను ఈ సినిమాలోకి తీసుకున్నారట. అయితే ఆమె ఎక్కువ బరువు తగ్గడమే దానికి కారణం అయ్యిఉంటుందని తెలిపింది మృణాల్. ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ వచ్చిందట. లవ్ సోనియా’ అనే సినిమా ఆడిషన్ కు వెళ్లిందట మృణాల్. అయితే ఈ సినిమాలో అక్రమ రవాణాకి బలైన చెల్లిని కాపాడుకునే అక్కగా కనిపించింది మృణాల్. అయితే చెల్లిని కాపాడుకోవడానికి వేశ్య అవతారం ఎత్తాల్సి ఉంటుంది.
ఈ సినిమా కోసం కోల్‌కతాలోని ఓ వేశ్యా గృహంలో రెండువారాలు ఉందట మృణాల్. అక్కడ వాళ్ళతో గడిపి వారి కథలు విని చెలించిపోయిందట.. ఆ తర్వాత కూడా వాళ్ళ కథలే వెంటాడాయట. ఆ సమయంలో డిప్రషన్ లోకి వెళ్లిందట.. ఆయా సమయంలో దర్శకుడు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి మాములు మనిషిని చేశాడట. ఇక ఆ సినిమాసెట్ లో దర్శకుడు యాక్షన్ చెప్పగానే నటించలేక ఏడ్చేసిందట. 17 ఏళ్ల అమ్మాయిని 60 ఏళ్ల వృద్ధుడికి అమ్మే సన్నివేశమది. ఆసమయంలో ఆ వేశ్యల కథలే కళ్ళముందు మెదిలాయట.. నేను చేయలేను అంటూ ఏడ్చేసిందట. అయితే నువ్వు ఈ సన్నివేశం చేస్తే ప్రపంచం చూస్తుంది అని దర్శకుడు చెప్పడంతో ఆమె దైర్యం తెచ్చుకొని నాటించ్చిందట.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..