AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ‘ఆదిపురుష్’ టీజర్ పై ఈసారి కాపీ ఆరోపణలు.. ఆ సీన్స్ అక్కడి నుంచి లేపేశారట..!

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రామాయణ నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనునున్నాడు.

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ఈసారి కాపీ ఆరోపణలు.. ఆ సీన్స్ అక్కడి నుంచి లేపేశారట..!
Adipurush
Rajeev Rayala
|

Updated on: Oct 05, 2022 | 9:56 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాకోసం ప్రభాస్ అభిమానులతోపాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రామాయణ నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనునున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ టీజర్ అయోధ్యలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ టీజర్ ప్రభాస్ ను రాముడి గెటప్ లో చూడాలన్న డార్లింగ్ ఫ్యాన్స్ కు కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. రాముడిగా ప్రభాస్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. కానీ గ్రాఫిక్స్ ఎక్కువగా వాడటంతో ఫ్యాన్స్ కస్సుబుస్సులులాడుతున్నారు. టీజర్ లో ప్రభాస్ లుక్ లో గ్రాఫిక్స్ మిక్స్ అయ్యి ఉండటంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత ఓ యానిమేషన్ మూవీలా అనిపించిందనే టాక్ ఎక్కువ గా వినిపించింది. అలాగే గ్రాఫిక్స్ కూడా చాలా నాసిరకంగా ఉన్నాయి అంటున్నారు నెటిజన్స్. ఇప్పటికే ఈ టీజర్ పై పలు విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాపీ ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలనుంచి కొన్ని సీన్స్ కాపీ చేశారని కొందరు నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘థోర్‌, అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌, లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌, కాంగ్‌ స్కల్‌ ఐలాండ్‌, ఆక్వామాన్‌, హౌజ్‌ ఆఫ్‌ ద డ్రాగన్, రైజ్‌ ఆఫ్‌ ద ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌.. సినిమాల నుండి కొన్ని సీన్లు కాపీ చేశారని అంటున్నారు . అంతే కాదు ఆ సినిమాలలోని సీన్స్ ను స్క్రీన్ షాట్స్ తీసి మరి కంపార్ చేస్తున్నారు. ముఖ్యంగా  రావణుడు పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పక్షి పై వచ్చే సీన్ హౌజ్‌ ఆఫ్‌ ద డ్రాగన్ నుండి లేపారట. అలాగే వానరసేన ను ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ నుంచి, అలాగే కొన్ని కింగ్ కాంగ్ నుంచి లేపేశారని ఆరోపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!