Omicron in India: భారత్ లోకి ఒమిక్రాన్ సబ్-వేరియంట్ BF.7 ఎంట్రీ.. దీపావళి నాటికి దేశంలో విస్తరిస్తుందన్న భయాలు..?

ఇప్పటికే కరోనా, ఒమిక్రాన్ కేసులతో తీవ్ర ఇబ్బందులు పడిన భారత్ లో కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్ BF.7 మొదటి కేసు నమోదైంది. గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ను ఇండియాలో తొలి కేసును గుర్తించింది. గుజరాత్..

Omicron in India: భారత్ లోకి ఒమిక్రాన్ సబ్-వేరియంట్ BF.7 ఎంట్రీ.. దీపావళి నాటికి దేశంలో విస్తరిస్తుందన్న భయాలు..?
Omicron New Variant
Follow us

|

Updated on: Oct 17, 2022 | 12:33 PM

ఇప్పటికే కరోనా, ఒమిక్రాన్ కేసులతో తీవ్ర ఇబ్బందులు పడిన భారత్ లో కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్ BF.7 మొదటి కేసు నమోదైంది. గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ను ఇండియాలో తొలి కేసును గుర్తించింది. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లోని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మాధవి జోషి.. ఒమిక్రాన్ కొత్త కేసు వేరియంట్ తో భయాందోళనలకు గురికావద్దని, ప్రజలు మాస్కులు ధరించడం, కనీస జాగ్రత్తలు పాటించడం వంటివి చేయాలని సూచించారు. ప్రజలు గుమిగూడకుండా ఉండడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అయితే.. చైనాలో ఇటీవల రెండు కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌లు BF.7, BA.5.1.7 గుర్తించబడ్డాయి. చైనాలో ఇటీవల కోవిడ్-19 కేసుల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని భారతదేశంలోని ప్రజారోగ్య నిపుణులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇతర దేశాల మాదిరిగా భారతదేశంపై అంతగా ప్రభావం చూపించలేదు. అయినప్పటికీ కనీస జాగ్రత్తలు పాటించడం వంటి విషయాలను మరవకూడదని చెబుతున్నారు.

BF.7 ను BA.2.75.2 అని కూడా పిలుస్తారు. అక్టోబర్ 4న నార్త్‌వెస్ట్ చైనా ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లో మొదటిసారిగా ఈ వేరియంట్ ను కనుగొన్నారు. వారం రోజుల్లోనే ఇది ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ వేరియంట్ BA.5.2.1 ఉప-వంశం, BF.7 బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, ఇంగ్లండ్‌లోనూ కనిపించిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఒమిక్రాన్ BA.5, BF.7 ఉప-వేరియంట్‌గా ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరిచినట్లు తెలిపాయి. అంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ఈ వేరియంట్ బారిన పడవచ్చని హెచ్చరించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను ఈ వేరియంట్ విషయంపై వార్నింగ్ ఇచ్చింది. అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్ సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదని తెలిపింది.

BF.7 సబ్-వేరియంట్‌ లక్షణాలు ఒమిక్రాన్ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. తలనొప్పి, ఎడతెగని దగ్గు, వాసన గుర్తించకపోవడం, ఛాతి నొప్పి, వినికిడి లోపం, వణుకు ఉంటాయి. పొత్తికడుపు నొప్పి, విరేచనాలు, ముక్కు కారటం, గొంతు నొప్పి, అలసట వంటి ఇతర కోరనా లక్షణాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 15 నాటికి భారతదేశంలో కరోనా యాక్టివ్ కేసులు 26,618 ఉన్నాయి. గత 24 గంటల్లో 2,430 కొత్త కరోనా ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,46,26,427 కు చేరింది. కోవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు 5,28,874 మంది ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి

 అయితే.. ఐదు రోజుల దీపావళి పండుగకు ముందు, ధంతేరాస్, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ పర్వదినాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌లు, ఆంక్షలు సడలించినప్పటికీ రెండు సంవత్సరాల తర్వాత, భారతదేశంలోని ప్రజలు పండుగ సీజన్‌ను పూర్తి ఉత్సాహంతో జరుపుకునే అవకాశం ఉంది. అయితే ఇది కరోనా కేసుల సంఖ్య పెరగడానికి దారి తీయవచ్చు, కాబట్టి పండుగ సమయాల్లో అప్రమత్తంగా ఉండటమే శ్రీరామరక్ష. 

మరిన్ని జాతీయ వార్తల కోసం..