Harassment: బాలికపై అత్యాచారం.. మూడు గంటల పాటు చిత్రహింసలు.. 18 గంటలైనా నమోదు కాని ఎఫ్ఐఆర్

ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్ నవూ లో మరోసారి దారుణ ఘటన జరిగింది. మరో సారి ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు తెరపైకి వచ్చింది. ట్యూషన్‌ కు వెళ్లి తిరిగి వస్తున్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. కథౌట సమీపంలో...

Harassment: బాలికపై అత్యాచారం.. మూడు గంటల పాటు చిత్రహింసలు.. 18 గంటలైనా నమోదు కాని ఎఫ్ఐఆర్
Harassment
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 17, 2022 | 11:49 AM

ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్ నవూ లో మరోసారి దారుణ ఘటన జరిగింది. మరో సారి ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసు తెరపైకి వచ్చింది. ట్యూషన్‌ కు వెళ్లి తిరిగి వస్తున్న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. కథౌట సమీపంలో ఇద్దరు అగంతకులు ఆటోలో ప్రయాణిస్తున్న బాలికను అడ్డుుకన్నారు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఈ ఘటన జరగగా.. బాధితురాలిని హుస్దియా కూడలిలో వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుంచి అతి కష్టం మీద ఇంటికి చేరుకున్న బాధితురాలు.. జరిగిన విషయమంతా కుటుంబసభ్యులకు చెప్పింది. ఆమె చెప్పిన వివరాలతో వెంటనే అలర్ట్ అయిన కుటుంబీకులు.. బాధితురాలితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. జరిగిన దారుణ ఘటన గురించి వారికి చెప్పారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆదివారం సాయంత్రం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు హుటాహుటిన నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే వారిని ఇంకా కస్టడీలోకి తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన జరిగిన 18 గంటల తర్వాత పోలీసులు బాలికను వైద్యం కోసం ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటన రాజధాని లఖ్ నవూ లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో మరోసారి తెలిపింది.

బాలిక ట్యూషన్ ముగించుకుని ఆటోలో వస్తున్న సమయంలో ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. కాసేపు ప్రయాణం చేసిన తర్వాత విద్యార్థినిపై దాడి చేశారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తరువాత యువకులిద్దరూ బాలికను ఆటోలో సుశాంత్ గోల్ఫ్ సిటీలోని ప్లాసియో మాల్ వెనుక ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 3 గంటల పాటు చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఆటోలో నుంచి కిందకి పడేసి వెళ్లిపోయారు.

ఈస్ట్ లక్నో డీసీపీ ప్రాచీ సింగ్ ఝల్కారీ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు.ఈ విషయమై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. త్వరలో నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతామని చెప్పారు. విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు విభూతిఖండ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. నిందితులిద్దరినీ ఆకాష్, ఇమ్రాన్‌లుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే