Vijay: ఏం ఫాలోయింగ్‌ సామీ.. ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న విజయ్‌.. ఏకంగా..

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌కి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు తమిళ నాట పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా..

Vijay: ఏం ఫాలోయింగ్‌ సామీ.. ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న విజయ్‌.. ఏకంగా..
Vijay Trending In Twitter
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 03, 2022 | 9:38 AM

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌కి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు తమిళ నాట పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా టాలీవుడ్‌లోనూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడీ హీరో. తెలుగులోనూ భారీ ఓపెనింగ్స్‌తో ఇక్కడి హీరోలకు పోటీ ఇస్తుంటాడు విజయ్‌. ఇక తాజాగా ట్విట్టర్‌లో ఫాలోయింగ్‌తో తన క్రేజ్‌ ఏంటో మరోసారి చాటుకున్నాడు విజయ్‌.

గడిచిన 15 రోజుల్లో విజయ్‌ గురించి ట్విట్టర్‌లో ఏకంగా 1.72 మిలియన్ల మంది ప్రస్తావించడం విశేషం. సౌత్‌ నుంచి ఆ మాటకొస్తే నార్త్‌లో బడా హీరోల కంటే ఎక్కువగా విజయ్‌ గురించే సెర్చ్‌ చేయడం విశేషం. గతంలో యంగ్ రెబల్‌ స్టార్‌ గురించి 1.52 మిలియన్ల మంది ప్రస్తావించారు. ఇప్పుడు విజయ్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇదిలా ఉంటే విజయ్ ప్రస్తుతం వారసుడు అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. దిల్‌ రాజ్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులను తిరగరాస్తోంది. వారసుడు ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తమిళ నాన్-థియేట్రికల్ అండ్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.280 కోట్లకు పైగా అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారసుడు ఏకంగా రూ. 10 కోట్ల బిజినెస్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..