Kantara: కాంతార చిత్రాన్ని వీడని వివాదాలు.. మరోసారి చిక్కుల్లో రిషబ్ శెట్టి.. కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు..
హీరో రిషబ్ శెట్టి.. నటన.. స్క్రీన్ ప్లే ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో విడుదల చేసిన డబ్బింగ్ వెర్షన్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది.
ఇప్పుడు ఎక్కడా చూసిన వినిపిస్తున్న పేరు కాంతార. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది ఈ చిత్రం. ముందు చిన్న సినిమాగా కన్నడ థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ..ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో భారీగా కలెక్షన్స్ అందుకుంటుంది. అంతేకాకుండా..హీరో రిషబ్ శెట్టి.. నటన.. స్క్రీన్ ప్లే ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో విడుదల చేసిన డబ్బింగ్ వెర్షన్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. అయితే ఓవైపు హిట్ టాక్‌తో అదరగొడుతున్న ఈ సినిమాకు వివాదాలు కూడా తప్పడం లేదు. ఇప్పటికే ఈ చిత్రంలోని వరహరూపం సాంగ్ పై కేరళలోని కోయిక్కోడ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ పాటను ఎక్కడా ప్లే చేయకూడదని.. థియేటర్లలో అసలు వినిపించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తాజాగా మరోసారి చిత్రబృందానికి పాలక్కాడ్ కోర్టు నుంచి షాక్ తగిలింది. కేరళలోని పాలక్కాడ్ స్థానిక కోర్టు ఈ పాటను నిలిపివేయాలని ఆదేశించింది.
వరాహరూపం పాట కాపీ చేశారంటూ తైక్కుడం బ్రిడ్జ్ యూనిట్ ఆరోపించింది. తన నవరసం ట్యూన్‌ను వరాహరూపం పాటలో ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. వరాహ రూపం పాటపై కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారించిన కేరళ స్థానిక కోర్టు వరాహరూపం పాటపై స్టే విధించింది. ఇక ఇప్పుడు పాలక్కాడ్ కోర్టు కూడా ఇదే విధమైన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయమై ‘మాతృభూమి మ్యూజిక్’ పాలక్కాడ్ జిల్లా కోర్టులో కేసు వేసింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ‘తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ పాటను ఎక్కడా షేర్ చేయడం గానీ, ప్రసారం చేయడం గానీ కుదరదు’ అని పేర్కొంది. కోర్టు ఆదేశాల తర్వాత కాంతార చిత్రయూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.. ‘తైక్కుడం బ్రిడ్జ్’ బ్యాండ్‌కు చెందిన వియాన్ ఫెర్నాండెజ్ ఇటీవలే మాకు క్రెడిట్ ఇస్తే ఈ పాటను ప్లే చేయడానికి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు.