AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara Movie: థియేటర్‌లో కాంతారను వీక్షించిన కేంద్ర మంత్రి.. దర్శకుడిపై ప్రశంసల వర్షం..

ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనంలా దూసుకొచ్చింది కాంతార చిత్రం. కేజీఎఫ్‌ చిత్రం ద్వారా మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని దేశానికి పరిచయం చేసిందీ చిత్రం. విడుదల వరకు అసలు ఎవరికీ తెలియని ఈ సినిమా.. విడుదల తర్వాత దేశ వ్యాప్తంగా..

Kantara Movie: థియేటర్‌లో కాంతారను వీక్షించిన కేంద్ర మంత్రి.. దర్శకుడిపై ప్రశంసల వర్షం..
Nirmala sitharaman watch Kantara movie
Narender Vaitla
|

Updated on: Nov 03, 2022 | 11:08 AM

Share

ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనంలా దూసుకొచ్చింది కాంతార చిత్రం. కేజీఎఫ్‌ చిత్రం ద్వారా మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని దేశానికి పరిచయం చేసిందీ చిత్రం. విడుదల వరకు అసలు ఎవరికీ తెలియని ఈ సినిమా.. విడుదల తర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనూహ్య విజయంతో ప్రాంతాలు, భాషలకు అతీతంగా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. రిషబ్‌ శెట్టి నటన, అద్భుత దర్శకత్వంతో ఈ సినిమా విజయతీరాలను అందుకుంది. ఒక్క తెలుగులోనే ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లు రాబట్టింది అంటే కాంతార స్టామినా ఏంటో అర్థం అవుతుంది.

కలెక్షన్లకే పరిమితం కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుందీ చిత్రం. యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు సైతం ఈ సినిమాను వీక్షిస్తూ చిత్ర యూనిట్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ జాబితాలోకి కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మాల సీతారామన్‌ కూడా వచ్చి చేరారు. బుధవారం బెంగళూరులో చిత్రాన్ని వీక్షించిన కేంద్ర మంత్రి ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

థియేటర్‌లో సినిమాను వీక్షించిన నిర్మాలా ట్వీట్ చేస్తూ..’వాలంటీర్లు, శ్రేయోభిలాషుల బృందంతో కలిసి బెంగళూరులో సినిమాను చూశాను. సినిమాను బాగా తెరకెక్కించారు. ఈ చిత్రం తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది’అంటూ రాసుకొచ్చారు. థియేటర్‌లో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ఇక తెలుగులో రూ. 50 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తోంది. అత్యధిక కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్లకుపైగా రాబట్టి అరుదైన రికార్డును దక్కించుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక