AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Dhavan: రణబీర్‏ను ఫాలో అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ ధావన్..

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మాస్త్ర మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రణబీర్ కపూర్. తాజాగా మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తెలుగు తెరపై సందడి చేయనున్నారు.

Varun Dhavan: రణబీర్‏ను ఫాలో అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ ధావన్..
Bhediya
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2022 | 11:24 AM

Share

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో భాషతో సంబంధం లేకుండా మంచి రెస్పాన్స్ అందుకుంటూ భారీగా వసూళ్లు రాబడుతున్నాయి పలు చిత్రాలు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2, పుష్ప చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో రికార్డ్స్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కాంతార హవా కొనసాగుతుంది. కన్నడ చిత్రమైన ఈ మూవీ తెలుగుతోపాటు హిందీలోనూ సత్తా చాటుతోంది. తమ సినిమాలతో పాన్ ఇండియా స్టార్స్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోస్. అల్లు అర్జున్, రిషబ్ శెట్టి, రామ్ చరణ్, ఎన్టీఆర్, నిఖిల్ సిద్ధార్థ్ క్రేజ్ ఎలా ఉందో తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మాస్త్ర మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రణబీర్ కపూర్. తాజాగా మరో యంగ్ అండ్ టాలెంటెడ్ వరుణ్ ధావన్ తెలుగు తెరపై సందడి చేయనున్నారు.

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది. 2018లో, అమర్ కౌశిక్, శ్రద్ధా కపూర్ , రాజ్‌కుమార్ రావు నటించిన స్త్రీ సినిమాతో దినేష్ విజన్ నిర్మాతగా పరిచయం అయ్యాడు. 2018 లో వచ్చిన ఈ హర్రర్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2018 లో వచ్చిన స్త్రీ, 2021 లో వచ్చిన రూహి తరువాత, దినేష్ విజన్ యొక్క హారర్-కామెడీ యూనివర్స్‌లో వస్తున్న చిత్రం “భేదియా” ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. హిందీ, తమిళం మరియు తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి సనన్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఇదివరకే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి పోషిస్తుంది. మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో “గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “భేదియా” తెలుగులో విడుదల చేస్తున్నారు. మరో నిర్మాత బన్ని వాసు ఆలోచనను, అల్లు అరవింద్ నిజం చేస్తూ, ఇటీవల గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు రాష్ట్రాల్లో కాంతార తెలుగు వెర్షన్‌ను విడుదల చేసింది మరియు ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పుడు మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

Follow Us
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..?
ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..?