AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pavala Syamala: బతికున్నానా? లేదా? అని కూడా ఎవరూ పట్టించుకోలేదు.. పావలా శ్యామల కంటతడి

ఆమె రీల్ లైఫ్‌లో మంచి కామెడీ పాత్రలు వేసి నవ్వులు పూయించింది. కానీ రియల్ లైఫ్ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. ఆరోగ్యం సహకరించక ఇబ్బందులు ఎదుర్కుంటుంది.

Pavala Syamala: బతికున్నానా? లేదా? అని కూడా ఎవరూ పట్టించుకోలేదు.. పావలా శ్యామల కంటతడి
Actress Pavala Shyamala
Ram Naramaneni
|

Updated on: Nov 03, 2022 | 11:13 AM

Share

ఆమె వందల సినిమాల్లో నంటించింది. విభిన్న పాత్రల్లో మెప్పించి.. విలక్షణ నటిగా పేరు సంపాదించుకుంది. హస్య ప్రధాన పాత్రల్లో మనల్ని ఎంతో నవ్వించిన.. ఆమె చాలాకాలంగా దు:ఖంలో ఉంది. అయ్యో అని అనేవారే తప్ప.. అక్కున చేర్చుకునేవారు లేరు. దీంతో కుమార్తెలో కలిసి.. అనాథాశ్రయంలో ఉంటూ బతుకు నెట్టుకెళ్తుంది. ఆమె ఎవరో కాదు. పావలా శ్యామల. ఆమెకు ఆరోగ్యం సహకరించడం లేదు. ఆమె కుమార్తెకు కూడా బాగా సుస్తి చేసి మంచంకే పరిమితమైంది. దీంతో సినిమాల్లో నటించేందుకు కూడా వీలులేదు. ఎలా ఉన్నావ్ అని కదిస్తే.. తన దయనీయ పరిస్థితి చెబుతూ కంటతడి పెట్టుకుంటుంది పావలా శ్యామల. తనను, తన బిడ్డను చూసుకోడానికి ఎవరూ లేరని వాపోయింది.

గతంలో మెగాస్టార్ చిరంజీవి మంచి మనసుతో లక్ష రూపాయలు కట్టి.. తనకు ‘మా’ లో సభ్యత్యం ఇప్పించారని.. ఖర్చుల కోసం మరో రెండు లక్షలు ఇచ్చారని తెలిపింది. అప్పట్లో అందరూ చేసిన సాయంతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చామని.. మళ్లీ పాత రోజులు వచ్చాయని వెల్లడించింది. బతుకుదెరువు ఏ మార్గం తెలియడం లేదని.. ఆత్మహత్యే శరణ్యమని వాపోయింది. ప్రస్తుతం ‘మా’ నుంచి తనకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపింది. మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ అయ్యాక తనను చూసుకునేందుకు ఒక అమ్మాయిని పెట్టారని పావలా శ్యామల తెలిపింది. అయితే ఆమె మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిందని, ఆ తర్వాత తమ గురించి పట్టించుకున్న నాథుడే లేడని   ఏడ్చేసింది.

అప్పట్లో సాయం చేసేందుకు వచ్చిన కరాటే కల్యాణి.. తన ఇంటిని చూసి చీదరించుకుందని.. తమ గురించి తప్పుగా ప్రచారం చేసిందని వాపోయింది. ఇంట్లో ఇద్దరు మనుషులూ అనారోగ్యంతో ఉంటే ఇంక శుభ్రంగా ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ప్రజంట్ ఆమె మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పావలా శ్యామలను ఆదుకోవాలని ఇండస్ట్రీ పెద్దలను నెటిజన్స్ కోరుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..