AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: ఆదివారం నాడు ఈ 5 పరిహారాలు పాటిస్తే.. జీవితంలో సంపద, శ్రేయస్సు సిద్ధిస్తుందట..!

సూర్య భగవానుని ఆరాధనకు ఆదివారం ఉత్తమమైన రోజుగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుని గ్రహాల రాజు అంటారు. సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే,

Astrology: ఆదివారం నాడు ఈ 5 పరిహారాలు పాటిస్తే.. జీవితంలో సంపద, శ్రేయస్సు సిద్ధిస్తుందట..!
Lord Surya
Shiva Prajapati
|

Updated on: Nov 06, 2022 | 6:23 AM

Share

సూర్య భగవానుని ఆరాధనకు ఆదివారం ఉత్తమమైన రోజుగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుని గ్రహాల రాజు అంటారు. సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే, వ్యక్తి జీవితంలో చాలా అభివృద్ధి చెందుతాడు. వారి ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, కీర్తి లభిస్తాయి. అదే సమయంలో, సూర్యుడు బలహీనమైన లేదా బాధాకరమైన స్థితిలో ఉంటే.. వ్యక్తులు తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఏ పని కూడా విజయవంతం అవదు. అయితే, ఇలాంటి చెడు దుష్ప్రభావాలకు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. ఆదివారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయట. మరి ఆ చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదివారం రోజు చేయాల్సిన పరిహారాలు..

1. ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు, ఖచ్చితంగా ‘ఓం సూర్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్య నమః’ అనే మంత్రాన్ని జపించాలి. దీంతో సూర్యభగవానుడు త్వరగా ప్రసన్నుడై మీ కోరికలన్నీ తీరుస్తాడు.

2. ఆదివారం నాడు ఇంటి బయటి తలుపుకు ఇరువైపులా దేశీ నెయ్యి దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. నెయ్యి దీపం వెలిగించడం ద్వారా సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నులవుతారని విశ్వాసం. తద్వారా ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని చెబుతారు.

ఇవి కూడా చదవండి

3. గంధపు తిలకం ఆదివారం ఇంట్లోంచి బయటకు తీయాలి. ఇలా చేయడం వల్ల మీరు ఏ పని కోసం బయటకు వెళుతున్నారో అది ఖచ్చితంగా పూర్తవుతుందని విశ్వాసం. అలాగే, ఆదివారం ఎరుపు రంగు దుస్తులు ధరించడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు.

4. ఆదివారం దానం చేయడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి బెల్లం, పాలు, బియ్యం, దుస్తులు దానం చేయాలి. ఇలా చేస్తే మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.

5. ఆదివారం నాడు ప్రవహించే నీటిలో బెల్లం, బియ్యం కలపడం శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం లభిస్తుంది. నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..