AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీ ఇంటి వాస్తులో ఈ లోపాలున్నాయా.? అయితే మీ దాంపత్య జీవితం నరకమే..

ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపుతుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. వాస్తు నిపుణులు ఇదే విషయాన్ని చెబుతుంటారు. ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వారి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితిపై ఎఫెక్ట్ చూపిస్తుందని నమ్ముతుంటారు. అందుకే ఇంటి నిర్మాణం సమయంలో వాస్తు పకడ్బందీగా ఉండేలా చూసుకుంటారు. లేని నేపథ్యంలో నిర్మాణం తర్వాతైనా వాస్తును..

Vastu Tips: మీ ఇంటి వాస్తులో ఈ లోపాలున్నాయా.? అయితే మీ దాంపత్య జీవితం నరకమే..
Vastu Tips
Narender Vaitla
|

Updated on: Nov 06, 2022 | 12:50 PM

Share

ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపుతుందని నమ్మేవారు చాలా మంది ఉంటారు. వాస్తు నిపుణులు ఇదే విషయాన్ని చెబుతుంటారు. ఇంటి వాస్తు ఇంట్లో ఉండే వారి ఆరోగ్య, ఆర్థిక పరిస్థితిపై ఎఫెక్ట్ చూపిస్తుందని నమ్ముతుంటారు. అందుకే ఇంటి నిర్మాణం సమయంలో వాస్తు పకడ్బందీగా ఉండేలా చూసుకుంటారు. లేని నేపథ్యంలో నిర్మాణం తర్వాతైనా వాస్తును సరిచేసుకుంటుంటారు. వాస్తు చిట్కాల ఆధారంగా ఇంట్లో మార్పులు, చేర్పులు చేసుకుంటారు. అయితే వాస్తు కేవలం ఆరోగ్యం, ఆర్థికంపైనే కాకుండా దాంపత్య జీవితంపై కూడా చూపిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు సరిగ్గా లేని ఇంట్లో నివసించే దంపతుల మధ్య నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతుంటుంది. ఇంతకీ ఎలాంటి వాస్తు లోపం కారణంగా దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే వాస్తులో ఎలాంటి మార్పులు చేసుకోవాలి.? లాంటి అంశాలపై వాస్తు నిపుణులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారంటే..

* ఆగ్నేయ దిక్కున ఉన్న బెడ్‌ రూమ్‌లో ఎట్టి పరిస్థిల్లోనూ నిద్రించకూడదు. ముఖ్యంగా దంపతులు ఈ దిశలో నిద్రిస్తే ఇంట్లో సమస్యలు ఎక్కువవుతుంటాయి. పొరపాటున కూడా ఈ దిక్కులో నిద్రించకూడదని నిపుణులు చెబుతున్నారు. బెడ్‌ రూమ్‌లో నైరుతి దిశలో ఉండడం ఉత్తమమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* ఇక బెడ్‌ రూమ్‌ ఉండకూడని మరో దిక్కు ఈశాన్యం. సహజంగానే ఈ దిశలో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు. ఈశాన్యంలో నిద్రించే దంపతుల మధ్య నిత్యం గిల్లిఖజ్జాలు ఉంటాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

* సహజంగా ఈశాన్యం దిక్కులో ఎలాంటి నిర్మాణాలను చేపట్టరాదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఈ దిశలో ఖాళీ స్థలం లేదా నీటి సంపులు వంటి వాటిని నిర్మిస్తుంటారు. ఇక ఈశాన్యంలో వంట గది ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. దంపతుల మధ్య గొడవలు తగ్గాలంటే ఈశాన్యంలో వంట గది ఉండకుండా చూడాలి.

* వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ముళ్లులు ఉండే మొక్కలను పెంచకూడదు. ఇలాంటి మొక్కలను పెంచడం ద్వారా ఇంట్లో తరచూ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది.

* బెడ్‌ రూమ్‌లో గోడలకు లైట్‌ కలర్‌ ఉండేలా చూసుకోవాలి. నలుపు, ఎరుపు వంటి డార్క్‌ కలర్స్‌ కాకుండా స్కై బ్లూ, లైట్‌ పింక్‌ వంటి ప్రశాంతంగా కనిపించే రంగులను వేయాలి. రంగలు మనుషుల ఆలోచనపై ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతుంటారు.

నోట్‌: పైన తెలిపిన సమాచారం కొందరు వాస్తు నిపుణుల అభిప్రాయం మేరకు అందించినది మాత్రమే. దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆద్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..