Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: లడ్డూ ప్రసాదం పై ఆ వార్తలు అవాస్తవం.. దయచేసి వాటిని నమ్మొద్దు.. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..

తిరుమల అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదం. ఏ ఆలయంలోని ప్రసాదానికీ లభించని రుచి తిరుమల లడ్డూ సొంతం. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని..

Tirumala: లడ్డూ ప్రసాదం పై ఆ వార్తలు అవాస్తవం.. దయచేసి వాటిని నమ్మొద్దు.. భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..
Tirumala Laddu
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 10, 2022 | 5:55 PM

తిరుమల అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదం. ఏ ఆలయంలోని ప్రసాదానికీ లభించని రుచి తిరుమల లడ్డూ సొంతం. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత బంధువులకు, తెలిసిన వాళ్లకు పంచుతుంటారు. ఈ క్రమంలో లడ్డూ పై కొన్ని వదంతులు వచ్చాయి. ప్రసాదం బరువు తగ్గించారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై టీటీడీ స్పందించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్‌ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. నిబంధనల ప్రకారం శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుంది. కానీ, ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలు తూకం వేయగా.. 90 నుంచి 110 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వేయింగ్‌ మిషన్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని అధికారులు చెప్పారు.

శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు. శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు కలిగి ఉంటుంది. ప్రతి రోజూ పోటు కార్మికులు త‌యారు చేసిన ల‌డ్డూ ప్రసాదాల‌ను ఒక ప్రత్యేక‌ ట్రేలో ఉంచి, ప్రతి ట్రే బ‌రువును పోటు అధికారులు త‌నిఖీ చేస్తారు. అనంత‌రం ల‌డ్డూ ప్రసాదాల‌ను కౌంట‌ర్లకు త‌ర‌లించి, భ‌క్తుల‌కు అందిస్తారు. ఇందులో పూర్తి పార‌ద‌ర్శత ఉంటుంది. వేయింగ్ మిషన్‌లో సాంకేతిక‌ సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కార‌ణంగా లడ్డూ బరువుపై భ‌క్తులు అపోహల‌కు గుర‌య్యారు. లడ్డూ బరువు కచ్చితంగా 160 నుంచి 180 గ్రాములు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భ‌క్తి శ్రద్ధల‌తో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. ల‌డ్డూ బ‌రువు, నాణ్యత విష‌యంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ ప‌డ‌లేదు.

– టీటీడీ, పత్రికా ప్రకటన

ఇవి కూడా చదవండి

వాస్తవానికి ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద ఏదేని ఇబ్బంది త‌లెత్తితే వేంట‌నే అక్కడ అందుబాటులో ఉన్న ల‌డ్డూ కౌంట‌ర్ అధికారికి తెలియ‌జేయాలి. అక్కడిక్కడే స‌మ‌స్యను ప‌రిష్కరించే వ్యవ‌స్థ టీటీడీలో ఉంది. అయితే లడ్డు బరువు తక్కువ ఉందని చెప్పిన వ్యక్తి.. ఈ నిబంధనలు పాటించకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం శోచ‌నీయని టీటీడీ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి
వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి
హోండా నుంచి 2 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. రెండింటిలో ఏది ఉత్తమం..!
హోండా నుంచి 2 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. రెండింటిలో ఏది ఉత్తమం..!
ఏప్రిల్ నెలలో వారికి పట్టిందల్లా బంగారం..12 రాశుల వారికి మాసఫలాలు
ఏప్రిల్ నెలలో వారికి పట్టిందల్లా బంగారం..12 రాశుల వారికి మాసఫలాలు
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్ గుర్తుందా.. ?
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్ గుర్తుందా.. ?
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..