Andhra Pradesh: వర్సిటీలో యోగి వేమన విగ్రహం తొలగింపుపై ప్రభుత్వ వివరణ.. అసలు ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఉన్న యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తొలగించారన్న వార్త వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ విషయమై పలు పత్రికల్లో కథనాలు కూడా..
ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఉన్న యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తొలగించారన్న వార్త వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ విషయమై పలు పత్రికల్లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. దీంతో ఈ విషయమై ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.
ఈ విషయమై ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఫ్యాక్ట్‌చెక్.ఏపీ.జీఓవీ.ఇన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫొటోలతో సహా అసలు విషయాన్ని తెలియజేశారు. వేమన విగ్రహం విషయంలో వస్తోన్న వార్తలన్నీ నిరాధారణమైనవని తేల్చి చెప్పారు. అభివృద్ధి పనుల్లో భాగంగా విగ్రహాన్ని యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వేమన విగ్రహాన్ని యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు.
The YSR statue that has been placed, was already there in the university premises at a different place. The university management has shifted both the statues as they deemed fit.
Misleading news article on the same issue is nothing but biased journalism. 2/2
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) November 10, 2022
ఇక వేమన విగ్రహం స్థానంలో ఏర్పాటు చేసిన వైస్సార్ విగ్రహం అప్పటికే వర్సిటీ ప్రాంగణంలోనే ఉందని, వేమన విగ్రహాన్ని ఎంట్రెన్స్‌లోకి మార్చిన నేపథ్యంలోనే అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇక ఈ విషయంపై వర్సిటీ వైస్ ఛాన్సలర్ మునగాల సూర్యకళావతి కూడా స్పందించారు. తాము కొత్త విగ్రహాలను తీసుకురాలేదని… ఉన్న విగ్రహాలనే మరో చోటుకు మార్చామని తెలిపారు. కొత్త అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కు వైఎస్సార్ పేరు పెట్టడం వల్ల అక్కడున్న స్థలంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ వివరణతోనైనా వివాదం చల్లబడుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..