Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: విశాఖలో సీఎం జగన్ పర్యటన – పూర్తి వివరాలివే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో సీఎం జగన్ ఆయనతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు..

CM Jagan: విశాఖలో సీఎం జగన్ పర్యటన - పూర్తి వివరాలివే..
Cm Ys Jagan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 10, 2022 | 4:57 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో సీఎం జగన్ ఆయనతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. 6.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం 10.05 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతారు. 10.30 నుంచి 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి మధ్యాహ్నం 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

కాగా.. ఈ నెల 11న ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. మదురై నుంచి నేరుగా విశాఖపట్నంకు సాయంత్రం 6:30 గంటలకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తూర్పు నౌకాదళం చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు ఆంధ్రా విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 10, 472 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.

మరోవైపు.. తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 12న ఏపీలోని విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రామగుండానికి ప్రధాని చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎ్‌ఫసీఎల్‌)ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైల్వే లైనును జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..