TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలోనే డిసెంబర్‌ కోటా టిక్కెట్లు విడుదల.. ఎప్పుడంటే..

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల కలియుగ వైకుంఠవాసుని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను టీటీడీ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ మేరకు శుక్రవారం10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది దేవస్థానం.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలోనే డిసెంబర్‌ కోటా టిక్కెట్లు విడుదల.. ఎప్పుడంటే..
TTD
Follow us

|

Updated on: Nov 10, 2022 | 11:12 AM

శ్రీవారి భక్తులకు టీటీడీ (టీటీడీ) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల కలియుగ వైకుంఠవాసుని ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ మేరకునవంబర్‌ 11న ఉదయం 10 గంటలకు టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌ నెలకు సంబంధించిన టిక్కెట్లను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) కల్పించే రూ.300 టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనున్నారు. కాగా.. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల దర్శనాలు రద్దు చేసింది. కేవలం సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఆయా తేదీలను చూసుకొని, టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం కేవలం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. నిన్న తిరుమల శ్రీవారిని 22,423 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 9,679 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

ఇక తిరుమలకు భక్తులు పోటెత్తడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ముందస్తు ప్రణాళికతో బస, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి