Hyderabad: భాగ్యనగరంలో మరో అద్భుత నిర్మాణం.. 300 ఏళ్ల నాటి పురాతన బావి పునరుద్ధరణ..

పూడిపోయిన మెట్ల బావి పునరుద్ధరణ పనులను 2021లో ప్రారంభించారు. దాదాపు 5 వందల టన్నుల మట్టి, చెత్తను లారీల్లో తొలగించారు. మట్టి తీస్తున్నకొద్దీ అద్భుతమే బయటపడింది. ఆనాటి అరుదైన, చారిత్రక మెట్ల బావి కనిపించింది.

Hyderabad: భాగ్యనగరంలో మరో అద్భుత నిర్మాణం.. 300 ఏళ్ల నాటి పురాతన బావి పునరుద్ధరణ..
Bansilalpet Metla Bavi
Follow us
Surya Kala

|

Updated on: Nov 14, 2022 | 8:03 AM

దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన బావికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. జనావాసాల మధ్య ఉన్న 800 లారీల చెత్తను తొలగిస్తే గానీ.. ఈ కట్టడం కనిపించలేదు. నీటి బావిలోకి వెళ్లేందుకు 70 పైగా మెట్లు ఉన్నాయి. ఈ పురాతన బావికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు త్వరలోనే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ మన్‌ కీ బాత్‌ 87వ ఎపిసోడ్‌‌లోనే దీని గురించి ప్రస్తావించారు. జల సంరక్షణ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రతి నీటిబొట్టు విలువైనదే. నీటి రీ సైక్లింగ్‌పై మనం దృష్టి పెట్టాలన్నారు. సికింద్రాబాద్‌ బన్సీలాల్‌ పేటలోని చారిత్రక మెట్ల బావి గురించి మోదీ మాట్లాడారు. ఏళ్ల తరబడి మెట్ల బావిని నిర్లక్ష్యం చేయడవం వల్ల మట్టి, చెత్తతో నిండిపోయింది. అయితే ఇప్పుడు మెట్ల బావి పునరుద్ధరణ జరుగుతోందన్నారు. ఈ కృషిని ప్రశంసించారు.

దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగం. బన్సీలాల్‌ పేట మెట్ల బావి కూడా అటువంటిదే. ఈ మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో మళ్లీ జీవం పోసుకుంది. అప్పట్లో నిజాం రాజులు మంచి నీటి కోసం ఈ బావిని కట్టించారు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో మెట్ల బావుల లాగే దీన్ని కూడా కళ్లు చెదిరేలా నిర్మించారు. పూడిపోయిన మెట్ల బావి పునరుద్ధరణ పనులను 2021లో ప్రారంభించారు. దాదాపు 5 వందల టన్నుల మట్టి, చెత్తను లారీల్లో తొలగించారు. మట్టి తీస్తున్నకొద్దీ అద్భుతమే బయటపడింది. ఆనాటి అరుదైన, చారిత్రక మెట్ల బావి కనిపించింది. మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ సహా అధికారులు బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గొప్ప పర్యాటక ప్రాంతంగా మెట్లబావి పరిసరాలను తీర్చిదిద్దుతామ‌ని మంత్రి తలసాని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..