Hyderabad: మరో యువకుడి ప్రాణం తీసిన లోన్ యాప్ భూతం.. రూ.20 వేలు తీసుకోని.. రూ. 60 వేలు కట్టినా..

హైదరాబాద్‌ శివార్లలో అదృశ్యమైన ఓ యువకుడు రైలు పట్టాల పక్కన శవమై తేలాడు. అయితే, ఆ యువకుడి డెత్‌ వెనక మిస్టరీ స్థానికంగా కలకలం రేపింది. ఇంతకీ, ఆ యువకుడు సూసైడ్‌ చేసుకున్నాడా? చంపేశారా? అసలేం జరిగింది..

Hyderabad: మరో యువకుడి ప్రాణం తీసిన లోన్ యాప్ భూతం.. రూ.20 వేలు తీసుకోని.. రూ. 60 వేలు కట్టినా..
Loan App Harassment
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 14, 2022 | 6:00 AM

లోన్‌ యాప్‌ వేధింపులకు మరొ యువకుడు బలైపోయాడు. లోన్‌ యాప్‌ వేధింపులు భరించలేక.. హైదరాబాద్‌ శివార్లలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. షాద్‌నగర్‌ సమీపంలో రైలు కిందపడి సూసైడ్‌ చేసుకున్నాడు సాయిచరణ్‌. రంగారెడ్డి జిల్లా నందిగామలో ఈ విషాద ఘటన జరిగింది. లోన్‌ యాప్‌ ద్వారా 20వేల రూపాయలు అప్పు తీసుకున్న సాయిచరణ్‌ (24), తీసుకున్న రుణానికి మూడు రెట్లు అధికంగా చెల్లించాడు. అయినా, ఇంకా డబ్బు కట్టాలంటూ నిర్వాహకులు వేధించడంతో తట్టుకోలేకపోయాడు. రోజురోజుకీ వేధింపులు పెరిగిపోవడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, సాయిచరణ్‌ సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్‌ బయటపడింది. సూసైడ్‌కి కొన్నిరోజులు ముందు ఇంటి నుంచి వెళ్లిపోయాడు సాయిచరణ్‌. లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేకే వెళ్లిపోతున్నట్లు సన్నిహితులకు చెప్పాడు. అలా వెళ్లిపోయిన సాయి చివరికి సొంత గ్రామంలో రైలు పట్టాల దగ్గర శవమై తేలడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తల్లడిల్లిపోతున్నారు.

సాయిచరణ్‌ పదో తరగతి పూర్తి చేసి.. స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులకు అతడే ఆధారమని కుటుంబసభ్యులు తెలిపారు. సాయిచరణ్‌ తన ఆర్థిక అవసరాల కోసం స్మార్ట్‌ఫోన్‌లో లోన్‌యాప్‌ ద్వారా నెల రోజుల క్రితం రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడని.. ఇప్పటివరకు దాదాపు రూ.60 వేలు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇందుకు తన ద్విచక్రవాహనాన్ని సైతం అమ్మాడు.

తీసుకున్న రుణానికి ఇంకా వడ్డీ చెల్లించాలంటూ.. ఫోన్‌లో వేధింపులు అధికమవ్వడంతో గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం శనివారం తెల్లవారుజామున నందిగామ సమీపంలో రైలు పట్టాల పక్కన సాయిచరణ్‌ శవమై కనిపించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?